ఆంధ్రాకు జరిగిన అన్యాయం గురించి తెలుగు మీడియాలో బాగానే చర్చ జరిగింది. పార్లమెంట్ లో సమాధానం వెలువడగానే ముందుగా ఏబీఎన్  ఈ విషయాన్ని అందుకుంది. ఏపీకి అన్యాయం జరిగిపోయిందని బ్రేకింగ్స్ వేసి హడావిడి చేసింది. ఏపీకి టోపీ.. చెవిలో కమలం అంటూ టైటిల్స్ వేసి ఇష్యూని హైలెట్ చేసింది. 



ఆ తర్వాత కాస్త ఆలస్యంగా అందుకన్నా.. టీవీ9 తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. ఈ ఇష్యూ బయటకు వచ్చినదగ్గర నుంచి వేరే ఇతర వార్తల జోలికిపోకుండా.. దీన్నే హైలెట్ చేసింది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖుల నుంచి ఫోన్ కాల్స్ తీసుకుంటూ, లైవ్ డిస్కషన్స్ పెడుతూ రచ్చరచ్చ చేశాయి. 


టీవీ9 ఇంకో అడుగు ముందుకేసింది. ప్రత్యేక హోదాపై పోరాటంలో కేంద్ర మంత్రి వెంకయ్య తీరును ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనాలను హైలెట్ చేసింది. వెంకయ్యను అవమానిస్తూ తయారు చేసిన ఫ్లెక్సీల చిత్రాలను పదే పదే చూపించింది. 


మిగిలిన టీవీ చానళ్లు కూడా హోదా హుళక్కే వార్తపై ప్రధానంగా దృష్టిసారించడంతో.. ఏపీ సర్కారులోనూ కదలిక వచ్చింది. అసలే మీడియా మేనేజ్ మెంట్ లో ముందుండే చంద్రబాబు అప్పటికప్పుడు పరకాలను రంగంలోకి దింపారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనని స్పష్టంగా చెప్పలేదని.. హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఓ ప్రకటన చేయించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: