ఈ రోజు నేపాల్‌ను భారీ భూకంపం తాకిన నేపథ్యంలో నాలుగు దేశాలు అతలాకుతలం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలో శనివారం భూమి కంపించింది. అంతే కాదు ఉత్తర భారతంపై దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాని ప్రకంపనలు కనిపించాయి. ఏపీలోని  కృష్ణ జిల్లా గొల్లపూడి, తూర్పూ గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మామిడికుదురు, కడియంలో భూ ప్రకంపనలు వచ్చాయి. విజయవాడలోని రామలింగేశ్వరనగర్‌, బెంజిసర్కిల్‌, గొల్లపూడి, మొగల్రాజపురం ప్రాంతంలో 5 సెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించాయి.


భూకంపంతో సర్వం కోల్పోయిన కుటుంబం


 కోస్తా జిల్లాలో శనివారం సంభవించిన భూప్రకంపనల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడిన అనంతరం భూకంపంపై అధికారులతో సమీక్షించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: