నేపాల్ లో భూకంపం విలయం సృష్టించింది. 1500 మందికిపైగా పొట్టనపెట్టుకుంది. చారిత్రక  కట్టడాలు కూడా నేలమట్టమయ్యాయి. వందల ఏళ్ల నాటి పురాతన నిర్మాణాలు ఆనవాళ్లు కోల్పోయాయి. మొత్తానికి నేపాల్ ఓ శవాల దిబ్బగా మారింది. 

ఇప్పుడు నేపాల్ భూకంపం ఏపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ కొత్త రాజధానిగా విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని ఎంపిక చేయడమే ఇందుకు కారణం. ఇది భూకంప ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతంగా నిపుణులు చెబుతున్నారు. రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామకృష్ణన్ నివేదిక కూడా ఇదే విషయాన్ని చెప్పింది. 


అన్ని నివేదికలనూ తోసిరాజని.. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందన్న ఉద్దేశంతో విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఆ రాజధాని కూడా సింగపూర్ స్థాయిలో కడతామంటున్నారు. మరి నేపాల్ లో వచ్చిన స్థాయి భూకంపం ఏపీ రాజధానిలో వస్తే పరిస్థితి ఏంటన్నది ఊహించుకుంటేనే భయమేస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

ఇప్పటికైనా ఏపీ రాజధానిగా భూకంపం ప్రమాదంలేని ప్రాంతాన్ని ఎన్నిక చేయాలని కోరుతున్నారు. మరి అంతా నిర్ణయం అయ్యాక ఏపీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా..?



మరింత సమాచారం తెలుసుకోండి: