నేపాల్‌లో భూకంపం మహావిలయం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 2000 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలిసిన సమచరం మృతులు నలుగు ఐదు వేల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. వేలాది మంది గాయపడ్డారు.  రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. ప్రాచీన ఆలయాలు కుప్పకూలాయి.


నేపాల్‌ను కుదిపేసిన భూకంపం భారత్ పైనా ప్రభావం చూపింది భారత్‌లోను   దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్‌లలోను ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ రాష్ట్రాల్లో ప్రాణ నష్టం ఎమి జరగలేదు. బీహార్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ బెంగాల్‌ భూకంప తీవ్రతకు వణికిపోయాయి.


గోడలు ఇంటిపైకప్పులు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 55 మంది మృతి చెందగా సుమారు 270 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం పలు రాష్ట్రాల్లో 30 నుంచి 65 సెకన్లపాటు దేశవ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: