అనుకున్నంతా అయ్యింది.. ఎర్రచందనం కేసులో నటి నీతూ అగర్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితం ఏపీహెరాల్ట్ చెప్పింది కూడా. సినిమా హీరోయిన్ ఎర్రచందనం కేసులో ఎందుకు అరెస్టయింది..? చందనానికి ఆమెకు ఏమిటి లింకు..?


హీరోయిన్లను అరెస్టు చేస్తారంటే ఎక్కువగా అందరూ అనుకునే కారణం వ్యభిచారమే.. ఈకేసుల్లోనే హీరోయిన్లు ఎక్కువగా అరెస్టవుతుంటారు. కానీ ఈ హీరోయిన్ ను మాత్రం ఎర్ర చందనం కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఈ నీతూ అగర్వాల్ గతంలో ప్రేమ ప్రయాణం అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా నిర్మాత మస్తాన్ వలీకి ఎర్రచందనం లింకుంది. కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారట. పోనీ సహజీవనంతో ఆపేసిందా.. అంటే ఆగలేదు.. ఏకంగా తన బ్యాంకు ఖాతాలు వాడుకునే స్వేచ్ఛ ఇచ్చేసింది. ఆయన ఈమె ఖాతాల నుంచే నగదు బదిలీలు కొనసాగించేవాడంట. 



మస్తాన్ వలీతో పాటు ఇతర చందనం కేడీలు కూడా నీతూ అకౌంట్ వాడుకున్నారట. అన్నీ పక్కా ఆధారాలు సంపాదించిన పోలీసులు అమ్మడి అరెస్టు కోసం కొన్నిరోజుల పాటు గాలించారు. మొత్తానికి నీతూ అగర్వాల్ ను అరెస్టు చేసేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: