తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల విషయాల్లో టీఆర్ఎస్ చురుకుగా పాల్గొన్నప్పటికీ గ్రేటర్ ఎన్నికలు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల విషయంలో అలసత్వం చూపుతున్నదని హైకోర్టు చాలా సార్లు హెచ్చరించింది. ఇప్పడు గ్రేటర్ హైదారబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది.


హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ 


డిసెంబర్ 15 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు టీసర్కార్ ను ఆదేశించింది. 180 రోజుల్లో వార్డుల రిజర్వేషన్ల పునర్విభజన పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదిలావుంటే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆరు నెలల అదనపు సమయం కోరింది.  అక్టోబర్ ముప్పై ఒకటి లోగా హైదరాబాద్ డివిజన్ లను పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది.ఎన్నికల నిర్వహణకు హైకోర్టు 225 రోజుల గడువు ఇచ్చింది. ఈలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఎ న్నికలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వివిద కారణాలు చూపుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసిన నేపధ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: