తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రాభల్యం తెలంగాణలో బాగానే కనబడుతుంది. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ ప్లీనరీలో కేసీఆర్ మరోమారు పార్టీ అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. తాజాగా నేడు ఆ పార్టీ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. రోజు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్రం సమితి పార్టీ నాయకులు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు జిల్లా నుంచి భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ సభను విజయవంతం చేసే భాద్యత ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు చాలెంజింగ్ గా తీసుకున్నారు. ఈ సభకు తెలంగాణలోని పది జిల్లాల నుంచి 10 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాదు గులాబీమయమైపోయింది. పార్టీ బేనర్లు, జెండాలతో హైదరాబాదు ప్రధాన రహదారులు నిండిపోయాయి.


టీఆర్ఎస్ సభకు వాహనాల ర్యాలీకి జెండా ఊపుతున్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 

TRS Party Public Meeting Arrangement Photos

ఒకప్పుడు  టీడీపీ పాలనలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్),  కొన్ని కారణాల వల్ల   ఆ పార్టీకి గుడ్ బై చెప్పి,  అప్పటికే తెలంగాణ అంతటా స్వరాష్ట్రం గురించి మెల్ల మెల్లగా పోరాటాలు మొదలైనాయి. అయితే వాస్తవానికి ఈ పోరాటం 60 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పటికి ఆంధ్రా పాలకులు దీన్ని అణచివేస్తూ వస్తున్నారు. తర్వాత కేసీఆర్ ఒక్క అడుగు ముందుకు వేసి టీఆర్ఎస్ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. అనతి కాలంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా ఆ పార్టీ సాగించిన ఉద్యమ తీరు తెలంగాణవాదులను ఒక్కతాటిపైకి చేర్చింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి నేటితో 14 ఏళ్లు నిండాయి.  


నగరంలో ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు

TRS Party Public Meeting Arrangement Photos

పదిలక్షల మందితో భారీగా ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ పయనం ఓ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన అనే మహాకార్యాన్ని భుజాన వేసుకున్న టీఆర్‌ఎస్ ఆ లక్ష్య సాధనకు 14సంవత్సరాల సుదీర్ఘ పయనం సాగించింది. అనేక అవాంతరాలు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కుంటూ ఎత్తిన జెండా దింపకుండా పోరాటాలు జరిపింది. నమ్మిన మార్గంలోనే చివరిదాకా నడిచి సుందర స్వప్నాన్ని సాకారం చేసుకుంది. 


సభా ప్రాంగణంలో మాట్లాడుతున్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి

TRS Party Public Meeting Arrangement Photos

సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సభను రాత్రి ఎనిమిది గంటలకల్లా ముగించేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. ధూంధాం ఆటపాటలతో మొదలయ్యే సభ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగంతో ముగుస్తుంది. సభాస్థలికి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్కింగ్ కమిటీ వీటిని పర్యవేక్షిస్తున్నది. పోలీసులు, వలంటీర్లతో వాహనాల పార్కింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో సభ ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: