దేశం టెక్నాలజీ పరంగా ముందుకు పోతుంది. అది అభివృద్దికి సూచకం అయినా కొన్నిసార్లు చాలా అనార్థాలకు తావు ఇస్తుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి అనర్థాలు పెచ్చుమీరిపోతున్నాయి. కేవలం తన సెల్ ఫోన్ లోని మెమరీ కార్డు దాచాడన్న నెపంతో తండ్రినే హత్య చేశాడు ఓ కసాయి కొడుకు .


సెల్ ఫోన్


కేవలం కొడుకును మంచి దారిలో పెడదామనుకున్న ఆ తండ్రి అదే కొడుకు చేతిలో దారుణంగా చనిపోయాడు.  దారుణమైన ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లిలోజరిగింది.  రాజు అనే యువకుడి తండ్రి మెమరీ కార్డు దాచాడని దీంతో తండ్రీ కొడుకుల మధ్య చాలా సేపు వాగ్వాధం జరిగింది. దీంతో తండ్రిపై కోపంతో రాత్రి నిద్రిస్తున్న సమయంలో బండరాయి తో తండ్రిపై దాడి చేశాడు. దీంతో రాజు తండ్రి హన్మంతు అక్కడికక్కడే మృతి చెందాడు. బుద్ధిగా చదువుకో అన్న పాపానికి కొడుకు చేతిలోనే తండ్రి హత్యకు గురయ్యాడని తెలిసిన గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: