జీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే సాక్షి మహరాజ్ ఈ సారి ఏకంగా కాంగ్రెస్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  బిజెపి ఎమ్.పి సాక్షి మహారాజ్ కు తిక్క ఎక్కువే లాగుంది.అందులోను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తరచూ తన తిక్కను ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య రాహుల్ గాంధీ కేదారినాథ్ ఆలయానికి పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి మహరాజ్ స్పందిస్తూ 'బీఫ్ (ఆవు మాంసం) తినే అలవాటున్న రాహుల్ గాంధీ తనను తాను శుద్ధి చేసుకోకుండా  కేదార్‑నాథ్  దేవాలయాన్ని సందర్శించారని ,అందువల్లనే నేపాల్,భారత్ లలో భూంకపం వచ్చిందని ఆయన అంటున్నారు. పరమశివుని ఆగ్రహానికి రెండు దేశాలు బలిఅయిపోయాయి అన్నాడు.


ఎంపీ సాక్షి మహరాజ్


రాహుల్ గాంధీ అపచారానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ కూడా తీవ్రంగా మండిపడింది. సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి సుస్మితా దేవ్ మాట్లాడుతూ... ఇంతకు ముందు ఆడవాళ్లు 10 మంది పిల్లల్ని కనాలి, కుక్కల మాదిరి పిల్లల్పి కనకుండా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వల్లే భూకంపం వచ్చిందని అర్ధరహితంగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: