ఎంత చెడ్డా రాజకీయనాయకుడికి సొంత ప్రాంతంపై ఉండే పట్టు వేరు.. రాష్ట్రమంతా ఎదురు గాలి వీచినా.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్  సొంత జిల్లాలో పరువు నిలుపుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కడప డీసీసీబీ ఛైర్మెన్‌ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంటుందని కడప తేదేపా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. జగన్‌పై ఉన్న వ్యతిరేకతే కారణమని మాజీ శాసనసభ్యులు వీరశివారెడ్డి అన్నారు.


మాదే గెలుపు: వీరశివారెడ్డి


కడప జిల్లా డీసీసీబీ ఎన్నిక వ్యవహారం జగన్ పరువును గంగలో కలిపేసేలా కనిపిస్తోంది. ఇక్కడ పలువురు డైరెక్టర్లు వివిధ కారణాలతో వైసీపీకి హ్యాండ్ ఇవ్వడంతో.. ఆదివారం జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో వైసీపీకి పరాజయం దాదాపు ఖాయమైంది. అధికారం చేతిలో ఉన్న టీడీపీ నేతలు చక్రం తిప్పి.. జగన్ సొంత జిల్లాలో ఆయన్ను దెబ్బ తీసేందుకు అంతా రెడీ చేసేశారు. 


అంతా అన్యాయం: వైసీపీ 


వాస్తవానికి ఈ ఎన్నిక శనివారమే పూర్తి కావాల్సి ఉంది. కోరం లేని కారణంగా అధ్యక్ష, కోఆప్షన్ ఎన్నికలు ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి పోమే నాయక్ ప్రకటించారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా టీడీపీ నుంచి 9 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. వైసీపీ డైరెక్టర్లు మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. ఆదివారం మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా ఎన్నిక జరిగిపోతుందని అధికారులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: