సాధారణంగా పాశ్చత్య దేశాల్లో ఎక్కువగా వినపడే పదం డేటింగ్. ఇద్దరు ఆడా,మగ కలిసి ఒకేదగ్గర కడపడం మన దగ్గర సహజీవనం అంటారు.  మరి ఒకరితో చేస్తే ఇద్దరితో చేస్తే పోని ఓ పది మందితో చేస్తే డేటింగ్ లో మజా ఏముంది అనుకున్నాడో ఏమో కాని ఏకంగా వంద మందితో డేటింగ్ చేసి అబ్బో  అనిపించాడు. ఫ్యాషన్ డిజైనర్ గా ,ఫోటోగ్రాఫర్ గా చెన్నై లో ఉంటూ అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న ఈ సుందరాంగుడు కేవలం నాలుగు నెలల్లో వందమంది తో డేటింగ్ చేసాడు. మరి డేటింగ్ అంటే రోజుల తరబడి కాదండి బాబు ఒక్కరోజు ఒకరితో అలా మనోడు వంది మందితో ఎంజాయ్ చేశాడట. ఈయన గారి డేటింగ్ లీస్టులో 105 ఏళ్ల బామ్మ అలివేలు ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో సినీనటి ఆండ్రియా జెర్మియా కూడా ఉందట.

సుందర్ రామ్ తో డేటింగ్ చేసిన వాళ్లు...


జేబు లోంచి నయాపైసా ఖర్చు పెట్టకుండా ఏరోజుకు ఆ రోజు డేటింగ్ మహిళల డబ్బుతోనే కడుపు నింపుకుంటూ వచ్చాడు. డబ్బున్న యువతితో ఫైవ్ స్టార్ హోటల్ లో డేటింగ్ చేసిన సుందర్ రామ్, నిరుపేద యువతి డబ్బులతో రోడ్డు మీద కేవలం పుచ్చ కాయతో కడుపు నింపుకోవడం విశేషం. మరి మనోడిలో మరో మనిషి కూడా ఉన్నాడు. అదే సమాజ సేవకుడు. డేటింగ్ చేసిన మహిళతో ఆ రోజు ఎంత ఖర్చు పెట్టించాడో అంతకు మరింత కలిపి అనాధ పిల్లలకు అన్నం పెడుతూ వచ్చాడు. ప్రెండ్స్ అంతా తనను ప్లే బాయ్ అని పిలిచినా, తాను అలాంటి వాడిని కాదని సుందర్ రామ్ చెప్పాడు.

105 ఏళ్ల భామ్మతో సుందర్ రామ్


తనకు శృంగారంతో సంబంధం లేదని , వివిధ రంగాల్లోని మహిళల్లో సాధికారత తీసుకురావడమే లక్ష్యమని తెలిపాడు. ఈ డేటింగ్ వ్యవహారం కారణంగా తనకు అద్భుతమైన అనుభవాలు మిగిలాయని రామ్ వెల్లడించాడు. 13 ఏళ్లుగా ఇల్లు కదలని ఓ బామ్మను డేటింగ్ పేరిట ఆమె సొంత ఊరుకు తీసుకువెళ్లానని, ఈక్రమంలో ఆమె అనుభవాలు ఎన్నో తెలుసుకున్నానని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: