వందనోటుకు ఏమాత్రం విలువ లేని కాలం ఇది. వెయ్యినోటు మార్చకుండా ఒక్క రోజు కూడా గడవని రోజులివి.. అలాంటిప్పుడు కోటి రూపాయల ఆస్తి పెద్ద ఎక్కువ మొత్తమేమీ కాదు.. కానీ.. అదే లక్ష కోట్లు అంటే ఎక్కువే మరి. మరి ఏకంగా 8 లక్షల కోట్ల సొమ్మంటే మాటలా.. ?
దత్తన్న దగ్గర 8 లక్షల కోట్లు..


అంత పెద్ద మొత్తంలో సొమ్ము తన దగ్గర  ఉందని ఓ కేంద్ర మంత్రి డైరెక్టుగా ఒప్పేసుకున్నాడు. అదీ పబ్లిగ్గా.. ఇంతకీ ఆయనెవరనేగా మీ సందేహం. ఆయనే కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ. ఔను మన సికింద్రాబాద్ ఎంపీ దత్తన్నే.. 
అంతా కార్మికుల సొమ్మే సుమా..


దత్తాత్రేయ దగ్గర అంత సొమ్మెక్కడిది చెప్మా.. అని ఆశ్చర్యపోకండి.. సొమ్మంటే ఆయన సొంతదేమీ కాదట. ఆయన ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి కదా.. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు దాచుకున్న సొమ్ము అంత ఉందట. ఆ సొమ్ము మొత్తం 8 లక్షల కోట్లు చేరిందట. ఇప్పుడు ఆ సొమ్మును నేను ధర్మకర్తను. సరిగ్గా ఉపయోగించాల్సిన బాధ్యత నాపైనే ఉందని.. ఆయన హైదరాబాద్ లో జరిగిన ఓ సభలో విన్నవించుకున్నారు. అదీ అసలు సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: