రామోజీ.. తెలుగు మీడియా మొఘల్.. ఒక్క మీడియా ఏమిటి.. ఆయన బహుముఖ వ్యాపార వేత్త.. ప్రియాపచ్చళ్లు మొదలుకుని.. మార్గదర్శి చిట్స్.. ఫిలింసిటీ.. రాబోయే ఓం సిటీ.. లెక్కల్లో చెప్పాలంటే రామోజీ వ్యాపార సామ్రాజ్యం ఖరీదు వేల కోట్లలోనే.. మరి అలాంటి రామోజీ.. ఓ ఎంపీని ఏం కోరిక కోరి ఉంటారు.. 
రామోజీ కోరిక తీర్చిన ఎంపీ


రామోజీ స్వంత ఊరు కృష్ణా జిల్లా పెదపారుపూడి. ఆయనకు ఇటీవల తన సొంత ఊరిని బాగు చేయాలన్న ఆలోచన వచ్చింది. అందుకే ఆ ఊరిని స్మార్ట్ విలేజ్ గా మార్చే క్రమంలో దత్తత తీసుకుందామని అనుకున్నారు. కానీ అప్పటికే మోడీ పిలుపు అందుకుని పెదపారుపూడిని ఎంపీ కొనకళ్ల నారాయణ దత్తత తీసేసుకున్నారు. 
సొంత ఊరి కోసం రామోజీ..


విషయం తెలుసుకున్న రామోజీ.. తన గ్రామాన్ని తానే అభివృద్ధి చేస్తానని.. కాబట్టి ఆ గ్రామాన్ని వదిలేయమని ఎంపీ కొనకళ్లను కోరారు. దాంతో నారాయణ ఓకే చెప్పారు. ఇటీవలే పెదపారుపూడి గ్రామ దత్తత మహోత్సవం పెదపారుపూడిలో ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో ఎంపీ నారాయణ ఈ విషయం అందరితో పంచుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: