కేటీఆర్, లోకేశ్.. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనున్న యువనాయకులు. ముఖ్యమంత్రులైన వారి తండ్రులు.. వారికి పగ్గాలు అప్పగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే వారికి అధికారం అప్పగించే.. శిక్షణ ఇస్తున్నారు. 
కేటీఆర్ కు హరీశ్ మైనస్..


ఐతే.. వీరిద్దరిలో కేటీఆర్ కు ఓ మైనస్ పాయింట్ ఉంది. కేటీఆర్‌కు హరీశ్ పెద్ద అవరోధం. తన కంటే ముందు రాజకీయాలలో ప్రవేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థుడైన, చురుకైన, విశ్వసనీయత కలిగిన రాజకీయ నాయకుడుగా హరీశ్‌కు మంచి పేరు ఉండటం కేటీఆర్ భవిష్యత్తును ఇబ్బంది కలిగించకమానదు. 
పార్టీలో ఎదురులేని లోకేశ్..


లోకేశ్‌ విషయానికి వస్తే అలాంటి ఇబ్బందులు లేవు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఆ సమస్య ఉన్నా.. చంద్రబాబు తన చాణక్యంతో క్రమంగా జూనియర్ ను అడ్డుతొలగించుకున్నారు. ఇప్పట్లో జూనియర్ నుంచి లోకేశ్ కు ఇబ్బందులేమీ ఎదురుకాకపోవచ్చు. చంద్రబాబు ఇప్పటికే..  ప్రభుత్వంలో తన తర్వాత తన కుమారుడే ముఖ్యుడనే విషయం అందరికీ అర్థమయ్యేవిధంగా చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: