వైసీపీకి గడ్డుకాలం నడుస్తున్నట్టుంది. ఆ పార్టీ అధినేత జగన్ కు చివరకు సొంత  జిల్లాలోనూ పరాభవం తప్పలేదు. మెజారిటీ డైరెక్టర్లు ఉన్నా.. కడప జిల్లా కేంద్ర సహకరాబ్యాంకు ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. అధికార బలంతో టీడీపీ ఆ పార్టీ డైరెక్టర్లను తమ వైపునకు తిప్పేసుకుంది. 
సొంత జిల్లాలో పరువు దక్కేనా..?


చివరకు డీసీసీబీ ఎన్నికలకు నామినేషన్ వేసే ధైర్యం కూడా వైసీపీ చేయలేకపోయింది. ఐతే కడప జిల్లా టీడీపీ విజయ పరంపర ఇంతటితో ఆగిపోదంటున్నారు తెలుగుదేశం నేతలు. కడప డీసీసీబీ అధ్యక్షుడుగా వీరశివారెడ్డి కొడుకు అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికైన సమయంలో.. టీడీపీ నేత సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి హెచ్చరికలు పంపారు. 
వైసీపీని ఖాళీ చేస్తాం..!


కేవలం డైరెక్టర్లే కాదు.. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీలోకి జంప్ అవుతారట. ఇప్పటికే నలుగురు వరకూ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సీఎం రమేశ్ చెప్పారు. వారు.. ఏక్షణమైనా టీడీపీలో చేరవచ్చని అంటున్నాడాయ. అంటే మరోసారి జగన్ కు భారీ ఝలక్ తప్పదేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: