అధికారం ఉన్న దగ్గరే వివాదాలు ఉంటాయి. అధికారాన్ని ప్రజాప్రయోజనం కోసం కాకుండా కక్ష సాధింపు కోసం వాడితే.. అది రాజకీయ సమరానికి దారి తీస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు..తనపై అలాంటి చర్యకే పాల్పడ్డారని దర్శకరత్న ఆరోపిస్తున్నారు. 

బాబుపై దాసరి విమర్శలు

హైదరాబాద్ లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ పెట్టే ఉద్ధేశంతో దాసరి నారాయణ రావు దాదాపు 18 ఏళ్ల క్రితం పదెకరాలు కొన్నారట. ఇది 1999 నాటి ముచ్చట. అప్పట్లో దాసరి కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించేవారు. దాంతో రాజకీయంగా కక్ష సాధించాలనుకున్న చంద్రబాబు.. ఆ భూములు అసెన్డ్ అని చెప్పి స్వాధీనం చేసుకున్నారట. 

చంద్రన్న భూరాజకీయం..
 
ఐతే... ఆ భూమి అసైన్డ్ భూమి కాదు.. పట్టాభూమి అని నిరూపించే ఆధారాలు దాసరి దగ్గర ఉన్నాయట. విషయం కోర్టు మెట్లెక్కింది. ఈ భూమి విషయంలో స్టే తెచ్చుకున్నారట దాసరి. ఇప్పుడు కేసీఆర్ ను కలసి.. ఆ భూమి వ్యవహారం క్లియర్ చేయించుకుని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలని దాసరి భావిస్తున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: