ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనంపై యాజమాన్యం నుంచి హామీ లభించలేదు. అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. డిమాండ్ల  పరిష్కారానికి సమయం కావాలని,  జులై వరకూ సమ్మె వాయిదా వేసుకోవాలని యాజమాన్యం ఈ సందర్భంగా కార్మిక సంఘాలను కోరింది.
ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్‌మెంట్ చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 28 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే 28 శాతం ఫిట్మెంట్కు అంగీకరించేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దాంతో చర్చలు విఫలం అయ్యాయి. 


ఆర్టీసీ సమ్మెవల్ల ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు


ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. మరోవైపు రవాణామంత్రి మహేందర్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమ్మెపై చర్చించారు. కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. కార్మిక సంఘాలు 43శాతం ఫిట్‌మెంట్‌ కోరుతున్నట్టు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 43శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం కష్టమని, నిధుల సమీకరణపై చర్చిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కోరిక మేర ఫిట్ మెంట్ ఇస్తే తప్పకుండా చార్జీల భారం సామాన్యులపై పడుతుందని ఇరు ప్రభుత్వాల అభిప్రాయ పడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: