ఇలా చెప్పేస్తే అది ప్రభుత్వపు బరితెగింపునకు అద్దం పట్టినట్లు అవుతుందని, ప్రజలందరూ ఆడిపోసుకుంటారనే భయం కూడా మన నాయకులకు ఉన్నట్లు లేదు. లేదా, మన మాటలు ప్రజల్లో పరువు తీసేస్తాయనే అవగాహన వారికి కలుగుతున్నట్లు లేదు. అందుకే ప్రభుత్వంలోనే అమాత్యులు ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నారు. మంత్రుల పైరవీలకు తప్ప సామాన్యుల అవసరాల నిమిత్తం ప్రభుత్వంలో పనులు చేయబోయేది లేదంటూ కుండబద్ధలు కొట్టినట్లు తేల్చిచెప్పేస్తున్నారు. 


రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధాజ్ఞలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఈ నిషేధాన్నిఎత్తివేసి.. బదిలీల ప్రక్రియను ఎప్పటికి చేపడుతుందా అని ఉద్యోగులు చాలా కాలంనుంచి నిరీక్షిస్తూ ఉన్నారు. అలాంటి వారి ఆశలపై నీళ్లు చిలకరించేస్తూ.. ఇప్పట్లో నిషేధం ఎత్తేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించేశారు. ఈ ఏడాది సాధారణ బదిలీలు ఉండబోవని ఆయన చెప్పేశారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని బదిలీలు మాత్రం చేస్తారట.. అది కూడా ఎవరైనా రిక్వెస్టు పెట్టుకుంటే మాత్రమే బదిలీలు జరుగుతాయట. వీరెవ్వరికీ కూడా టీఏ, డీఏలు కూడా ఇవ్వబోరట. మొత్తానికి సర్కారు ఖజానాకు డబ్బు ఖర్చు కాకుండా చూసుకోవడానికే బదిలీల గురించి పట్టించుకోవడం లేదన్నది సత్యం.


అయితే ఇక్కడే ఒక మతలబు ఉంది. దాన్ని కూడా యనమల చాలా స్పష్టంగా వెల్లడిరచడం విశేషం. అవసరమైన చోట సంబంధిత మంత్రులు ప్రతిపాదనలు పంపితే మాత్రం పరిపాలన అవసరాలకోసం బదిలీలు చేపడతారంట. అలాంటి వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారంట. అంటే మొత్తానికి బదిలీలు కావాల్సిన వారు మంత్రులు ప్రాపకం సంపాదిస్తే తప్ప పని జరగదన్నమాట. తద్వారా బదిలీలు ఆశించే వారినుంచి ఎడాపెడా దండుకోవడానికి మంత్రులకు ఒక మహదవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ ప్రకటన వలన తేటతెల్లం అవుతోంది. మంత్రులకు  మాత్రమే దోచుకునే అవకాశం కల్పించడం పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కడుపు మండి వారిలో అసంతృప్తి కూడా ప్రబలుతోందని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: