ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సినీ నటుడు కొన్ని రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నాడు. ప్రత్యేక హోదా ఏపీలో హాట్ టాపిక్కే అయినా మీడియా పెద్దగా ఈ దీక్షను పట్టించుకోవడంలేదు. నెంబర్ వన్ టీవీ ఛానల్ టీవీ9 మాత్రం మొదటి నుంచీ ఈ దీక్షలు హైలెట్ చేస్తూనే ఉంది. 

శివాజీకీ టీవీ9కు లింకేటి..?

ప్రతిరోజూ కొద్దిసేపు దీక్ష కార్యక్రమం లైవ్ ప్రసారం  చేయడం, శివాజీతో మాట్లాడించడం చేస్తోంది. అంతేకాదు.. కారెం శివాజీ, హర్షకుమార్ వంటి నేతలను వేదిక వద్దకు రప్పించి వారి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. మొత్తానికి శివాజీనీ హైలెట్ చేసే ప్రయత్నం టీవీ9 గట్టిగా చేస్తోంది. 

శివాజీ దీక్ష వెనుక..?

ఐటీ టీవీ9 మాత్రమే ఎందుకు శివాజీని హైలెట్ చేస్తోంది. శివాజీకీ, టీవీ9కూ ఉన్న లింకేమిటి.. ఇప్పుడిది మీడియా సర్కిల్లో హాట్ టాపిక్. శివాజీకీ.. ఆ ఛానల్ పెద్దకూ ఉన్న పరిచయంతోనే ఈ హైలెట్ కార్యక్రమం జరుగుతోందని ఓ టాక్. గతంలో టీవీ9 చేసిన అనేక క్యాంపెయిన్లకు శివాజీ హాజరయ్యాడు. 

లోగుట్టు.. వారికే ఎరుక..

సో.. ఆ పరిచయాల కారణంగానే టీవీ9 శివాజీకి ప్రాధాన్యమిస్తుందని కొందరు అంటున్నారు.  మరికొందరు మాత్రం కొత్త వాదన వినిపిస్తున్నారు.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు  అధికార పార్టీ ప్రోద్బలంతోనే ఈ మోసే కార్యక్రమం జరుగుతోందని ఓ టాక్. మరి వీటిలో ఏది నిజమో.. లోగుట్టు టీవీ9కూ.. శివాజీకే తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: