తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటతాయన్న పేరు ఉండనే ఉంది. ఆయన ఏది చెప్పినా.. ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం అలవాటు.. ఐతే.. కేసీఆర్ గొప్పదనం ఏంటంటే.. వినేవాళ్లకు అది అప్పటికే ఏమాత్రం అనుమానం రాదు.. అంత సింపుల్ గా నిజమేనేమో అనేంతగా మాట్లాడటంలో కేసీఆర్ దిట్ట..

నేతల చెవిలో కేసీఆర్ పువ్వులు..

అయితే.. కేసీఆర్ గొప్పలు.. ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. లేటెస్టుగా ఆయన నాగార్జునసాగర్ పార్టీ నేతల శిక్షణ శిబిరంలో చేసిన ప్రసంగంలో అది మరింతగా ప్రస్ఫుటమైంది. ఇప్పటికి ఆయన 80 వేల పుస్తకాలు చదివానని ఆయన నేతలకు హితబోధ చేశారు. 

కేసీఆర్ మనిషా.. రోబోనా..

ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. ఒక మనిషి 80వేల పుస్తకాలు చదవడం అసాధ్యమని ఇట్టే తెలిసిపోతుంది. రోజుకో పుస్తకం చొప్పున లెక్కేస్తే.. 80వేల పుస్తకాలు చదివేందుకు 219 సంవత్సరాలు పడుతుంది. 

వినేవాళ్లుంటే ఏమైనా చెప్పేస్తారా..
Image result for kcr speech in nagarjunasagar
అందులోనూ కేసీఆర్ లాంటి బిజీ పర్సన్.. 80 వేలు కాదు కదా.. అందులో పదో వంతు అంటే 8 వేలు చదవినా గొప్పే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇకనైనా కోతలు కోసే ముందు కాస్త ప్రాక్టికాలిటీ కూడా చూసుకుంటే బెటరని ఆయనకు సలహా ఇస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: