రాజకీయాల్లో ప్రతిపక్షం ఎప్పుడూ బలహీనంగానే కనిపిస్తుంది. అధికారపక్షం నిరంతరం బలంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అది అధికారంలో ఉన్న మాయాజాలం.. వింత ప్రజాస్వామ్య లక్షణం. ఇప్పుడు వైసీపీని కూడా అదే ఇబ్బంది పెడుతోంది.

జగన్ పార్టీ మూసేస్తున్నారా..?


అవసరం ఉన్నా లేకపోయినా.. ఏదో ఒక దీక్ష పేరుతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ హడావిడి చేస్తున్నారు. ఐనా.. ఆ పార్టీ తర్వలోనే మూసేస్తున్నారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కర్నూలు టీడీపీ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు.. త్వరలోనే జగన్ వైసీపీ జెండా పీకేయబోతున్నారని విమర్శించారు.


టీడీపీ అతిగా ఆశ పడుతోందా..?


టీడీపీని దెబ్బ కొట్టేందుకు 2009 ఎన్నికలకు ముందు వచ్చిన పీఆర్పీ తరహాలోనే వైసీపీకూడా త్వరలోనే జెండా పీకేయబోతోందని జోస్యం చెప్పేశారు. వైసీపీ అధినేత ఎన్నియాత్రలు చేసినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం మాత్రం తమవైపే ఉంటారని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: