ఏప్రిల్ 7న శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ పెను సంచలనమే సృష్టించింది. ఇందులో ఏకంగా 20 మంది తమిళ కూలీలు అక్కడికక్కడే మరణించారు. ఐతే ఇది ఎన్ కౌంటర్ ఏమాత్రం కాదని.. కూలీలను ముందే పట్టుకుని ఘటనాస్థలానికి తీసుకెళ్లి కాల్చారన్న విమర్శలు వచ్చాయి. 

ఎన్ కౌంటర్ కాదు.. హత్యలే.. ?


ఈ ఘటనపై తమిళనాడులోని ప్రజాసంఘాలు, నటీనటులు తీవ్రంగానే స్పందించారు. కొన్నాళ్లపాటు ఏపీ బస్సులను కూడా తమిళనాడులో నిలిపేశారు. ఐతే.. ఇప్పుడు ఆ ఎన్ కౌంటర్ కు సంబంధించి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సంచలన కథనం వెలువరించింది. 

ఎన్ కౌంటర్ గుట్టు విప్పుతున్న కాల్ డేటా..


చందనం స్మగ్లర్లది ఎన్ కౌంటర్ కాదని.. హత్యలేనని వివరిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారి సెల్ కాల్ డేటా ఆధారంగా ఈ కథనం రాశారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన చాలా మంది కూలీలు.. ఎన్ కౌంటర్ జరిగిన ముందు రోజు రాత్రి 9 గంటల వరకూ తిరుపతి పరిసరాల్లోనే ఉన్నట్టు వారి సెల్ ఫోన్ల కాల్ డేటా చెబుతోంది. 

బాబుకు ఇబ్బందే..


అలాంటి వారు.. కేవలం కొన్నిగంటల్లోనే అడవుల్లోకి వెళ్లి చందనం నరికి.. దుంగలను మోసుకుపోతూ పోలీసులకు కనిపించడం అసాధ్యమని ఆ కథనం వివరించింది.  ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసు అధికారులు.. ఎన్ కౌంటర్ మృతుల సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్ రికార్డ్ ఆధారంగా సాగించిన దర్యాప్తు వివరాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది. ఈ వివరాలను తమిళనాడు పోలీసులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి సమర్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: