మరికొన్ని రోజుల్లో జూన్ 2 వచ్చేస్తోంది. రాష్ట్రం రెండు ముక్కలైన రోజది. ఐతే.. విభజనతో తమ కష్టాలు ప్రారంభమైన రోజు కూడా అదే అనే భావనలో ఏపీ ప్రజలున్నారు. వారి కీలక డిమాండ్లను కేంద్రం ఇంతవరకూ పరిష్కరించలేదు. అందుకే.. తొలి ఏడాది పూర్తయిన రోజులోపే..  ఓ గుడ్ న్యూస్ తో ఏపీని ఖుషీ చేయాలని కేంద్రం భావిస్తోంది. 

ఇక ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్..

 
ఏపీకి ఇప్పటివరకూ ప్రత్యకమైన రైల్వే జోన్ లేదు. విభజన ద్వారా దక్షిణ మధ్య రైల్వే.. ఎక్కువగా తెలంగాణకే చెందుతున్నందువల్ల తమకో ప్రత్యేక జోన్ కావాలని ఏపీవాసులు కోరుతున్నారు. విభజనకు ముందు నుంచి విశాఖ ప్ర్తత్యేక జోన్ కావాలన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు వారం రోజుల్లో ప్రత్యేకజోన్ ఏర్పాటు ప్రకటన విడుదల కాబోతోంది. 

27న విశాఖలో ప్రకటన.. 


ఈనెల 27న కేంద్రం ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. మే 26కు మోడీ సర్కారు కొలువుతీరి ఏడాది పూర్తవుతుంది. కేంద్రమంత్రి వెంకయ్య.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో మంగళవారం భేటీ అయ్యారు. ఈమేరకు వెంకయ్యతో సురేష్ ప్రభు జోన్ ప్రకటన గురించి చెప్పారట. రైల్వే శాఖ మంత్రి విశాఖ వచ్చిమరీ జోన్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: