మనం ఉదయాన్నే లేవగానే పిల్లలకు సంతోషంతో ఏదో ఒక రకమై  టిఫిన్ చేసి పెడతాం.. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడల్స్. అంతే కాదు క్షణాల్లో తయారైపోతుంది నోటికి రుచిగా ఉంటుంది. మరి అలాంటపుడు ఎవరైనా దానికే ఎక్కువ ప్రియార్టీ ఇస్తారు. కానీ అలా తినిపించే మ్యాగీలు మీ చిన్నారులకు హాని చేస్తాయి అంటే మీరు నమ్ముతారా..? కానీ నమ్మాలి.  


గుమ గుమలాడే మ్యాగీ నూడుల్స్

No MSG in Maggi Noodles, Says Nestle, as States Reportedly Ask for Tests
అదేంటీ ఇంతకాలం లేని ముచ్చట ఇప్పుడు చెబుతున్నారు అని అనుకుంటున్నారా కానీ ఇది నమ్మలేని నిజం...రెండు నిమిషాల్లో సిద్ధమైయ్యే రుచికరమైన స్నాక్, టిఫిన్, లంచ్ ఐటమ్‌గా ప్రసిద్ధి చెందిన మ్యాగీ నూడిల్స్ ప్రమాదకరమని ఉత్తరప్రదేశ్ సర్కారు అంటుంటే, ఇది సురక్షితమైనదేనని నెస్లే సంస్థ తెలుపుతోంది. అసలు విషయం ఏమిటంటే మ్యాగీ నూడిల్స్లో మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) ప్రమాదకర స్థాయిలో ఉందని తమ పరీక్షల్లో తేలినట్టు యూపీ సర్కార్ తెలిపింది. లక్నోలో కొన్ని శాంపుల్స్ తీసుకున్న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వాటిని కోల్‌కతాకు పంపించగా, పరిమితులకు మించిన స్థాయిలో అందులో ఎంఎస్‌జీ ఉందని నివేదిక ద్వారా తేలింది.


మ్యాగీ కవర్



వాస్తవానికి ఎంఎస్‌జీని చైనా వంటకాల్లో మరింత రుచి కోసం వినియోగిస్తారు. తగినంత పరిమాణంలో వినియోగిస్తే ఎంత రుచిని పెంచుతుందో మోతాదు ఎక్కువైతే అన్ని అనర్ధాలనూ కలిగిస్తుంది. మరో వైపు  తాము మ్యాగీలో ఎంఎస్‌జీని కలపడం లేదని నెస్లే అంటోంది. తాము వాడే కొన్ని పదార్ధాల్లో సహజంగానే గ్లుటమేట్ ఉంటుందని, దాన్ని ఎంఎస్‌జీగా అపార్థం చేసుకుంటున్నారని వెల్లడించింది. మ్యాగీ అత్యంత సురక్షితమని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: