పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఏపీలో నూటికి 91 మందికిపైగా పాసై రికార్డు సృష్టించాయి. ఐతే.. ఈసారి జిల్లాల మధ్య ఫలితాలు పోల్చి చూస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. సాధారణంగా ఏ రిజల్ట్స్ వచ్చినా.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లా ఫస్ట్ ప్లేస్ కొట్టేయడం ఆనవాయితీ..

కడప ఫస్ట్ ప్లేస్.. 


ఈసారి కడప జిల్లా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 91.42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో 98.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

రెండు, మూడు స్థానాలను తూర్పుగోదావరి (96.75శాతం), పశ్చిమగోదావరి (95.15శాతం) జిల్లాలు దక్కించుకున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా 71.29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. మొత్తం 13 జిల్లాల్లో ఒక్క చిత్తూరు మినహా మిగిలిన అన్ని జిల్లాలూ 90 శాతానికి పైగానే ఫలితాలు సాధించాయి. 

అట్టడుగున చిత్తూరు జిల్లా..



చిత్తూరు జిల్లా మాత్రం కేవలం 71శాతం ఫలితం సాధించడం ఆశ్చర్యపరిచింది. అంటే మిగిలిన అన్ని జిల్లాలకూ.. ఆ జిల్లా మధ్య తేడా సగటులో 20 శాతం ఉండటం విశేషం. మొత్తం మీద పదోతరగతి ఫలితాల్లో జగన్ సొంత జిల్లా మొదటి స్థానం దక్కించుకుంటే.. సీఎం చంద్రబాబు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: