తమకు నచ్చని పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పత్రికలకు తమ సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు సాక్షి పత్రిక పరిస్థితి కూడా అదే. అందుకే చంద్రబాబు పాలనలోని లోపాలను  ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. గ్లోబల్ టెక్నాలజీ.. పారదర్శకత.. ఐటీ అని కలవరించే బాబు పాలనలోనూ టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని లెటెస్టుగా ప్రచురించిన కథనం కలకలం సృష్టిస్తోంది.  

బైరెటీస్ టెండర్లలో అక్రమాలు.. 


కడప జిల్లాలలోని బైరెటీస్ విక్రయం కోసం గతంలో గ్లోబల్ టెండర్లకు పిలువగా.. దీనికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందాలతో ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు కుట్ర పన్నిందంటూ కథనం ప్రచురించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70-75 శాతం కనీస ధర నిర్ణయించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సును కాదని... కొన్ని కంపెనీలకు అనుకూలంగా ఉండేందుకు కనీస ధరను  65 శాతానికి తగ్గించిందని పేర్కొంది. 

ఏపీఎండీసీకి కుచ్చుటోపీ.. 


బాబు ప్రభుత్వం తన జీవోలను తానే సవరించుకుని ఇలా అవకాశం కల్పించుకోవడం ద్వారా.. ప్రభుత్వానికి దాదాపు 150 కోట్ల వరకూ నష్టం వచ్చిందని తన కథనంలో పేర్కొంది. అంతే కాదు.. బాబు ప్రభుత్వం తన జీవోలో  స్థానిక కోటా రద్దు చేయడం వల్ల.. కడప జిల్లాలోని  218 పరిశ్రమలు మూతపడ్డాయని.. సుమారు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారని రాసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: