నిజమే పవన్ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు అన్న నమ్మకం ఈ మధ్య రాజకీయ నాయకులకు బాగా తెలిసి వచ్చింది. ఆయనకు నమ్మకం కలింగించే వ్యక్తులైతే చాలు.. అంతే కాదు తను అనుకున్న పని అయ్యేదాకా పట్టు వదలడు పవన్.  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన వ్యూహ చతురత ని ప్రదర్శించారు అందుకే బిజెపి నాయకుడు సోము వీర్రాజు కు ఎంఎల్ సి పదవి దక్కింది.  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల ఖాళీ లను భర్తీ ఇప్పటికే ఉత్కంఠత నెలకొన్నది నిన్నటికి నిన్న  ఎమ్మెల్సీ పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న జూపూడికి దురదృష్టం వెన్నాడి, ఆ పదవి కాస్త టీడీపీ పై అలకపానుపు ఎక్కిన ప్రతిభా భారతకి దక్కింది.

ప్రధాని నరేంద్ర మోడతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


ఇదే సమయంలో తెలుగు దేశం మిత్ర పార్టీ అయిన బిజేపీ కి ఒక స్థానాన్ని కేటాయించింది ఇంకేముంది పవన్ కి అతి సన్నిహితుడు అయిన సోము వీర్రాజు కు ఎమ్మెల్సీ పదవి అలా అలా కలిసి వచ్చేసింది. అయితే గతంలో బీజేపీ మీటింగ్ లో ప్రధాని మోడీ వద్దకు పవన్ కళ్యాన్ ని స్వయంగా తీసుకెళ్లి మాటా మంతి కలిపినట్లు సమాచారం. అలాగే టిడిపి తరుపున కూడా పవన్ ప్రచారం చేయడానికి సోము మధ్యవర్తిత్వం ఎంతో ఉంది . ఆ పనులను చక్కగా నిర్వహించిన సోము వీర్రాజు కి ఎం ఎల్ సి ఇవ్వడం న్యాయం అని భావించి పవన్ కోటాలో అతడికి చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: