తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత సీఎం కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కొత్త ప్రణాళికలతో హైదరాబాద్ అభివృద్దికి కృషి చేస్తున్నారు. అంతే కాదు ఇప్పటి వరకు ఎవరూ చేయని పంద్రాగస్టు పండుగ గోల్ కొండ కోటపై జరిపారు. ఈ మధ్య స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. దీనికి సామాన్య సిటిజన్ నుంచి మంత్రుల వరకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన  హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కార్యక్రమం దృష్ట్యా టాంక్ బండ్ పై ట్రాఫిక్ ను నిలిపి వేస్తున్నారు.


హుస్సేన్ సాగర్ ని పరిశీలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్


హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళణలో భాగంగా 10 రోజుల పాటు ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే పైపును తిరిగి తీసివేసి నూతన పైపును వేసేందుకు మూడు కిలోమీటర్ల మేర భారీ సొరంగాన్ని తవ్వనున్నారు. దీని ద్వారా భారీ పైప్‌లైన్‌ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది 10 రోజుల పాటు ఈ పనులను చేయనున్నారు.


హైదారాబాద్ లో హుస్సేన్ సాగర్


ప్రజలకు సూచించిన ట్రాఫిక్ సూచనలు : 

కర్బలా మైదాన్‌ వైపు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను బైబిల్‌ హౌస్‌, కవాడిగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మార్గాల్లోకి పంపుతారు. 

అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లాల్సి వస్తే కేవలం కవాడిగూడ వైపు నుంచి మాత్రమే అనుమతిస్తారు. 

ఆర్పీ రోడ్డు నుంచి కర్బలా మైదాన్‌వైపు వచ్చే ట్రాఫిక్‌ను బైబిల్‌హౌస్‌, కవాడిగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మార్గాల్లోకిమళ్లిస్తారు. 

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలను నెక్లెస్‌ రోటరీ, నల్లగుట్ట, కర్బలా మైదాన్‌, రాణిగంజ్‌ వైపు పంపుతారు.

అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఆర్టీసీ బస్సులూ ఈ మార్గాల్లోనే రాకపోకలు సాగించాలి. 


హుస్సేన్ సాగర్ పైనుంచి వెళుతున్న వాహనాలు


జూబ్లీబస్‌ స్టేషన్‌ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు వైఎంసీఏ జంక్షన్‌, సంగీత్‌, తార్నాక, ఓయూ, ఎంజీబీఎస్‌ మార్గంలో వెళ్లాలి. 

కట్టమైసమ్మఆలయం నుంచి చిల్డ్రన్‌ పార్కు వైపు వెళ్లే వాహనాలను వార్త కార్యాలయం నుంచి ఇందిరాపార్కు వైపు పంపుతారు. డీబీఆర్‌మిల్స్‌ నుంచి వార్త కార్యాలయం వీధిలోకి వాహనాలను అనుమతించరు.

లిబర్టీ నుంచి అంబేద్కర్‌ విగ్రహం, ట్యాంక్‌బండ్‌పై వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ కింద నుంచి నెక్లెస్‌రోడ్‌, పీవీఘాట్‌, నల్లగుట్ట, కర్బలా మైదాన్‌, సికింద్రాబాద్‌ వైపు పంపుతారు.

వాహనదారులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవడం మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: