తెలంగాణ సాధన కోసం అహర్శిశలు కష్టపడి మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. జూన్ మాసంలో  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం అన్ని సీఎం మాటలు మరువక ముందు ఓ యువకుడు ఆత్మహత్య ప్రత్నయత్నం చేసుకొని కలకలం సృష్టించాడు. గతంలో కాంట్రాక్టు విద్యుత్ కార్మికుడిగా పనిచేసిన యువకుడు ఉద్యోగం పొడిగించనందుకు పైగా ఉద్యోగం నుంచి తీసివేసినందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అతడిని నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించారు. ముందు ఇద్దరు యువకులు కలిసి సచివాలయానికి వచ్చారు. వారిలో ఒకరు పురుగుల మందు డబ్బా తీసుకొని తాగేశాడు.  


దీంతో అక్కడికి ఒక్కసారిగా పోలీసులు, సమీప అధికారులు హుటాహుటిన వచ్చి ఆ యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. ఒకపక్క, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం హామీల మీద హామీలు ఇస్తున్న నేపథ్యంలో ఇలా ఆత్మహత్య చేసుకొవడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం అయిన సమత బ్లాక్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ కారణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: