విశాఖ పట్నం జిల్లా రాజకీయాలకు మంచి చదరంగం లాంటిది. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలకు జంప్ అవుతారో ఎవరూ చెప్పలేరు.  కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటులా ఉండేవాడు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్సార్ సీపీలోకి జంప్ అయ్యాడు.  గత ఏడాది ఎన్నికల తర్వాత రామకృస్ణకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కు మద్య అబిప్రాయ బేదాలు తలెత్తాయి. దాంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. 


  కొణతాల రామకృష్ణ


ఆయన తెలుగుదేశ పార్టీలో, బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. కానీ అక్కవ ఆయా పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గూటికి చేరుకునే అవకాశం ఉంది, కటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆయన ఏ పార్టీలో చేరకుండా , తన అనుచరుల అబిప్రాయాలు సేకరిస్తూ వచ్చారు. చివరికి తిరిగి వైఎస్ ఆర్ చాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. అదికారికంగా ప్రకటన రావచ్చని బావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: