గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించింది గోదావరి జిల్లాలే.. ఈ రెండు జిల్లాలు దాదాపు స్వీప్ చేయడం ఆ పార్టీకి కొండంత అండ ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే ఆ పార్టీలో అసంతృప్తికి దారి తీస్తోంది. చంద్రబాబు కేవలం ఆ జిల్లాలపైనే దృష్టిపెడుతున్నారని సొంత పార్టీ మంత్రులే విమర్శించే పరిస్థితి తలెత్తుతోంది. 

నేరుగా చంద్రబాబుపైనే కేఈ విమర్శలు.. 


మొన్నటికి మొన్న సీఎం సొంత జిల్లా చిత్తూరు ఎంపీ శివప్రసాద్.. సీఎంపై విమర్శలు చేశారు. చంద్రబాబు దృష్టి గోదావరి జిల్లాలపైనే ఉందని.. ఆయన చిత్తూరు జిల్లాను పట్టించుకోవడం లేదని విమర్సించారు. లేటెస్టుగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కేఈ ఏకంగా పార్టీ మినీ మహానాడులో డైరెక్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

బాబు వైఖరితోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడామంటున్న కేఈ


చంద్రబాబు దగ్గరకు ఎప్పుడు వెళ్లినా మీ జిల్లాలో కేవలం 3 అసెంబ్లీ సీట్లే గెలిచారని ఎద్దేవా చేస్తుంటారని అన్నారు. అంతే కాదు.. ఎన్నికల చివరి నెల ముందు కాంగ్రెస్ నుంచి నేతలను చేర్చుకుని వారికి టికెట్లివ్వడం వల్లే పార్టీకి ఈ దుస్థితి పట్టిందని నేరుగా.. ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. ఇందులో తమ తప్పేమీ లేదని అంతా హైకమాండ్ చేసిన పొరపాట్లేనని బల్లగుద్దినట్టు చెప్పేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: