ఏపీ విష‌యంలో మ‌రో ఉత్కంఠ‌కు తెర‌తీసింది కేంద్ర‌ప్ర‌భుత్వం. ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని తెల్చి చెప్పింది. ఏపీ పున‌ర్వీభ‌జ‌న చ‌ట్టం ప్రకారం అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం ఆ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోధా ను కల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  కానీ తాజాగా ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ల‌భించే అవ‌కాశం లేద‌ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆరుణ్ జైట్లీ ప‌రోక్షంగా తేల్చిచెప్పాడు.శ‌నివారం ఆయ‌న బిజేపి కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యం పై క్లారీటి ఇచ్చాడు. ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌న్న హామీ ఉన్న‌ప్ప‌టికి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్ద‌ని, ఆ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆదాయ లోటుకు కేంద్రం నిదులు ఇవ్వాల‌ని 14 వ ఆర్ధిక సంఘం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వాఖ్య‌ల‌ను ఏపీ సీయం చంద్ర‌బాబు దృష్టికి తీసుకురాగా. .'కేంద్ర ఎదో ఒక ర‌కంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి అది ఏ రూపంలో అన్న‌ది కేంద్రం ఇష్టం' అని వాఖ్యానించారు.  

రాష్ట్ర విభజనకు ముహూర్తం నిర్ణయమైన తర్వాత


రాష్ట్ర విభజనకు ముహూర్తం నిర్ణయమైన తర్వాత సమైక్య ఉద్యమం అంటూ కొన్ని రోజులపాటు హడావుడి చేశారు. పులిని చూసి నక్క వాత‌లు పెట్టుకున్నట్టుగా తెలంగాణలో జరిగిన సకల జనుల సమ్మెను చూసి ఏపీలో కూడా ఉద్యోగులతో సమ్మె చేయించారు. బహిరంగ సభలు, ఆందోళనలు నిర్వహించారు. ‘‘విభజన అనివార్యం, ఈ దశలో సమైక్యం అని గొడవ చేసే బదులు మీకు ఏమి కావాలో మీ నాయకుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుంటే ఈ దుస్థితి రాకుండేది. విభజన బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందక ముందు మాకు ఫలానాది కావాలని కోరి ఉంటే ఆనాటి యూపీఏ ప్రభుత్వం కచ్చితంగా వాటిని బిల్లులో చేర్చి ఉండేది. అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నారు. ఆందోళనలు చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని అప్పుడు ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆందోళనలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని మరోసారి మభ్యపెట్టబోతున్నారు. ఇదంతా రాజకీయ నాయకులు ఆడుతున్న ఆట తప్ప ఇందులో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. 

 రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వేణుగోపాల్‌ రెడ్డి నేతృత్వంలోని


ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు లభించడం మినహా ప్రజలకు, పెట్టుబడిదారులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలలో అమలు చేసే పథకాలకు మంజూరు చేసే నిధులలో 90 శాతం గ్రాంట్‌గా లభిస్తుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వేణుగోపాల్‌ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం సిఫారసుల అనంతరం, అనేక కేంద్ర పథకాల రద్దుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, తన ప్రాయోజిత పథకాలకు ఇచ్చే గ్రాంటును 50:50 గా నిర్ణయించింది. అంటే ఆ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంటు సగానికి పరిమితమవుతుందన్నమాట. మిగతా సగాన్ని రాష్ట్రాలు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా సమకూర్చాల్సి ఉంటుంది. అయితే ఏపీ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక కేసుగా పరిగణించి, తన వాటాగా 70 శాతాన్ని అందజేసేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఏపీ మిగతా 30 శాతాన్ని భరిస్తే సరిపోతుందన్న మాట. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబడితే ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ పథకాలకూ ఈ 70:30 నిష్పత్తిని అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే ప్రత్యేక హోదా వల్ల అదనంగా మరో 20 శాతం నిధులొచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది.

ఏపీకి ప్రత్యేక హోదా దక్కే అవకాశం కనిపించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ


రాష్ర్టాన్ని హడావుడిగా విభజించి తమను దిక్కులేని వారిని చేశారని ఆగ్రహంతో రగిలిపోయిన సీమాంధ్ర ప్రజలు ఏడాది క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కకుండా చావుదెబ్బ కొట్టారు.  దీంతో కొంత కాలం పాటు ప్రజలకు ముఖం కూడా చూపించలేక ఇళ్లకే పరిమితమైన కాంగ్రెస్‌ నాయకులు, అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఈ దశలోనే ఏపీలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటున్నట్టు సంకేతాలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది మాజీ మంత్రులు బీజేపీలో చేరగా, మరికొందరు క్యూ కట్టినట్టు వార్తలు వచ్చాయి. ఏపీలో కాంగ్రెస్‌ పూర్వ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ కూడా ఆత్రంగా అడుగులు వేసింది. బీజేపీలో చేరికలకు వ్యూహ రచన చేశారు. ఇంకేముంది ఏపీలో బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి ఇక కోలుకునే చాన్స్‌ లేదని రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా దక్కే అవకాశం కనిపించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చావు కబురు చల్లగా చెప్పారు. 

ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇవ్వడం జరిగిపోయింది


ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని నినదిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, రాష్ట్ర విభజనకు ముందు ఎక్కడ నిద్రపోయారో తెలియదు. ప్రజలకు తెలియకపోయినా ఆనాడు కేంద్రంలో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులకు రాష్ట్ర విభజన జరిగిపోతుందని తెలుసు. అయినా ఆర్థికంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీలో రాబడి పెంచడానికి నిర్దుష్టమైన డిమాండ్లు ఏవీ చేయలేదు. విభజన విషయంలో కాంగ్రెస్‌- బీజేపీ కూడ బలుక్కుని ఏపీ ప్రజల గొంతు కోశాయి. చివరకు విభజన బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వచ్చినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని వెంకయ్యనాయుడు కోరడం, ‘అలాగే ఇస్తాం’ అని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇవ్వడం జరిగిపోయింది. ‘‘మీరు అడిగినట్టు చేయండి, మేము ఇచ్చినట్టు చేస్తాం’’ అంటూ కాంగ్రెస్‌- బీజేపీ తంతు పూర్తి చేశాయి.

 ఏపీకి ఏమి వస్తాయో, ఏమి రావో కూడా తెలియకుండా విభజన జరిగిపోయింది


హైదరాబాద్‌ కారణంగా తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని, రాజధాని లేకపోవడమే కాకుండా, చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేనందున ఏపీ పేద రాష్ట్రం అవుతుందని అప్పుడు కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా ఉన్నవారందరికీ తెలుసు! అయినా ఒక్కరు కూడా నోరెత్తలేదు. అడుగుదామనుకున్న వారిని అడగనివ్వలేదు. ఇందులో ఎలక్ర్టానిక్‌ మీడియా పాపం కూడా ఉంది. సీమాంధ్రులకు ఫలానాది కావాలని కోరిన వారిని ఎద్దేవా చేస్తూ ప్రసారాలు చేశాయి. దీంతో ఎవరికి వారు మనకెందుకులే అని మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఏపీకి ఏమి వస్తాయో, ఏమి రావో కూడా తెలియకుండా విభజన జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ వర్తమానంలోకి వద్దాం. రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు పెద్దగా ఉపయోగపడని ప్రత్యేక హోదాను తెర మీదకు తెచ్చి సరికొత్త నాటకానికి తెర తీశారు. 


ఏపీకి నిజంగా మేలు జరిగి, రాబడి పెరగాలంటే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు రావాలి. అవి రావాలంటే పన్ను రాయితీలు కల్పించాలి. సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను రాయితీ, ఆదాయపు పన్ను రాయితీ వంటివి కల్పిస్తే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అంతేగానీ ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన పరిశ్రమలు రావు. విభజన సందర్భంగా బుందేల్‌ఖండ్‌, ఉత్తరాఖండ్‌ తరహాలో పన్ను రాయితీలతో కూడిన ప్యాకేజీ ఇస్తామన్న హామీ కూడా వినిపించింది. ఒక దశలో ఎవరు ఏమి అడుగుతున్నారో, ప్రభుత్వం తరఫున ఏమి చెబుతున్నారో కూడా వినిపించని పరిస్థితి. ప్రత్యేక హోదా పదేళ్లపాటు కావాలని వెంకయ్యనాయుడు కోరగా, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉండటానికి మంత్రి అంగీకరించారంటూ అప్పుడు రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చున్న డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. మొత్తంమీద రేపు లేదన్నట్టుగా అంతా జరిగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: