తెలంగాణలో టీ టీడిపీ పట్టు సాధించాలంటే మంచి నాయకుడు, పాలక పక్షాని గట్టిగా నిలదీయటానికి ఒక ధీటైన వాడు ఎవరా అంటే ముందుగా వినపడేది రేవంత్ రెడ్డి పేరు అందుకే చంద్రబాబు నాయుడు ఈయన అంటే ప్రత్యేక అభిమానం.  తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని  ఆ మధ్య టీడీపీ కార్యాలయంలో కొన్ని పోస్టర్లు వేలిశాయి. అయితే ఆ పోస్టర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి తర్వాత క్లారిటీ ఇచ్చాడు.  ఇప్పుడు టిడిపి సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టిడిపి అద్యక్షుడిగా చేసే అవకాశం పై కధనాలు వస్తున్నాయి.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి


చంద్రబాబు నాయుడు మహానాడు లో ఏపీ,తెలంగాణ లకు వేర్వేరుగా అధ్యక్షులను ఎన్నుకొని తన భాద్యత కొంత తగ్గించుకోవాలని చూస్తున్నాడు.  అంతే కాదు చంద్రబాబు నాయుడును పార్టీ కేంద్ర కమిటీ అద్యక్షుడుగా ప్రకటించవచ్చు. ప్రస్తుతం తెలంగాణ నేత ఎల్. రమణ టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.  తెలంగాణలో ఉన్న సామాజిక వర్గాల నేపధ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డిని పార్టీ తెలంగాణ అద్యక్షుడుగా పెట్టవచ్చని కొందరు చెబుతున్నారు.

ముఖ్యంగా చంద్రబాబునాయుడు విశ్వాసాన్ని రెవంత్ రెడ్డి చూరగొన్నారని,తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎదుర్కోవడంలో రేవంత్ చొరవ చూపుతారన్న అబిప్రాయం కూడా ఉంది ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డికి అవకాశం రావచ్చని భావిస్తున్నారు.కాగా మరో సీనియర్ నేత శాసనసభలో ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: