నన్నే ప్రశ్నిస్తే ఎలా, బిజెపితో జగన్ చర్చలు జరిపితే తప్పేమిటి?  ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తననే ప్రశ్నించడం భావ్యం కాదు. తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రినని, తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని చెప్పారు. ఇది సాక్షాత్తు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్న మాట‌లివి. వాటిని సమ‌ర్ధించుకుంటూ తాజాగా నేన‌లా అన‌లేద‌ని బుకాయించారు మంత్రి. కేంద్ర క్యాబినేట్ లో ఉంటూ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఇలాంటి వాఖ్య‌లు చేయ‌టం ఏంట‌ని అడిగేవారికి స‌మాధానం ఎవ‌రిస్తారు?

ఏపీ ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌టం కుదుర‌ద‌ని అరుణ్ జైట్లీ తేల్చిన


ఏపీ ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌టం కుదుర‌ద‌ని అరుణ్ జైట్లీ తేల్చిన నేప‌ద్యంలో వెంక‌య్య‌నాయుడు ఘ‌టుగానే స్పందించారు. గ‌త‌ ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ చేసిన తప్పు వల్లే తమ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే ప్రత్యేక హోదా సాధించలేకపోయామని వివరించారు. ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ ఏపీకి లేవని, లోటుబడ్జెట్‌ అన్న ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని వెంకయ్య ఉద్ఘాటించారు. తనకు అన్ని రాష్ర్టాలు సమానమేనని తెల్చి చెప్పారు. ఇంత‌వ‌రకు బాగానే ఉంది కానీ.. రాష్ట్ర పున‌ర్వీభ‌జ‌న లో భాగంగా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉండటానికి అంగీకరించిన వెంక‌య్య, ప్రత్యేక హోదా పై ఎందుకు ప‌ట్టు విడిచాడ‌న్న‌ది ప్ర‌శ్నకు స‌మాధానం ఎవ‌రు చెప్పాలి? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


అంతేకాక.. దేశవ్యాప్తంగా 11 రాష్ర్టాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని అంటున్న మంత్రికి, ఆ విష‌యం నాడు గుర్తుకురాలేదా? అన్న‌ది అడ‌గాల్సిన ప్ర‌శ్నే? ఇప్పుడు ఏపీ లోటు బడ్జెట్‌ను పూరించేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశానని చెప్పడం న‌మ్మ‌ద‌గిన విష‌య‌మేనా?  ఇప్ప‌డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టడం అభినంద‌ల వ‌ర్షం కురిపించ‌డం, టీడీపీ, బీజేపీ మైత్రి కొనసాగుతుందని భావిస్తున్నానని చెప్ప‌డం పై ఆంత‌ర్య‌మేంటి? అది తెలియాల్సిందే.

వెంక‌య్య‌నాయుడు వివాదానికి తెర‌లెపిన మంత్రి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై వెంక‌య్య‌నాయుడు వివాదానికి తెర‌లెపిన మంత్రి, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తగిన అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నట్లు వచ్చిన వార్తలు తీవ్ర వివాదానికి దారితీసిన నేప‌ద్యంలో త‌ప్పించుకునే దారులు వేతుకుతున్నారు. ఇందుకోసం వెంకయ్య నాయుడు సోమవారం వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు ఎపికి లేవని తాను అనలేదని ఆయన స్పష్టం చేశారు. ముగిసిన క‌థ‌కు ముగింపు ఎందుక‌ని కాబోలు త‌న వంతు మాట‌గా ఏపీకి ప్రత్యేక హోదాపై తనకు ఇంకా నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు.

 ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూలంగా పరిశీలన జరుపుతుందని వెంకయ్యనాయుడు వివరించారు


గాడ్గిల్‌ ఫార్ములా కొలమానాల పరిధిలో ఏపీ లేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై విభజన సమయంలోనే బిల్లులో చేర్చి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. రెవెన్యూ లోటు ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీనిపై ఆర్థికమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఏపీకి ఆర్థికలోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చామని, బిల్లులో చేర్చకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూలంగా పరిశీలన జరుపుతుందని వెంకయ్యనాయుడు వివరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందులో తప్పేముందని బదులిచ్చారు. ఓకే త‌ప్పేమిలేదు. పార్టీ బ‌లం పెంచుకోవటానిక‌ని చెప్ప‌డంలో కూడా త‌ప్పులేదు క‌దా..  


తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని అంటున్న్నారు గౌరవనీయులైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడూ! కేంద్ర క్యాబినేట్ లో ఉంటూ... 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగు నేలపై, ఒక తెలుగువాడిగా వెంకయ్య చేసిన వాగ్ధానాలు, చెప్పిన కబుర్లు ఎవరు మరిచిపోగలరు! అటువంటప్పుడు ఎలా ప్రశ్నించకుండా ఉండగలరు!  ఏరు దాటాకా బోడి మల్లన్న అనడం ఎంతవరకూ న్యాయం? ఈ విషయాలు వెంకయ్య గారి విజ్ఞతకే వదిలెయ్యాలి!



మరింత సమాచారం తెలుసుకోండి: