ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలు.. తెలుగు మాట్లాడే ప్రాంతాలే అయినా.. రెండూ రెండు విభిన్న నేపథ్యం కలిగిన ప్రాంతాలు. దాదాపు 60 ఏళ్లపాటు ఒకే రాష్ట్రంలో కలసి ఉన్నాయి. కారాణాలేవైనా.. 60 ఏళ్ల తర్వాత విడిపోయాయి. మరి ఈ విభజన ఎవరికి లాభం చేకూరుస్తుంది.. ఎవరిని ఇబ్బంది పెడుతుంది..?

విభజనతో భవిష్యత్తులో తెలంగాణకే నష్టమా..


రాష్ట్ర విభజన కారణంగా ఇప్పటికిప్పుడు ఇబ్బంది పడింది మాత్రం ఏపీ అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. రాజధాని లేక.. ఆదాయం లేక.. ఏపీ బాగా సతమతమవుతోంది. అడ్డగోలుగా, అన్యాయంగా విభజించారని ఏపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉంటారు. కానీ .. ముందు ముందు ఆ పరిస్థితి ఉండదంటున్నారు ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు. 

తెలంగాణ వాళ్లు బాధపడేరోజు వస్తుంది.. 


గుంటూరు జిల్లాలో జరిగిన మినీమహానాడులో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో విభజన గురించి తెలంగాణవాళ్లు బాధపడే రోజు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ అభివృద్ధిని, పరిపాలనను చూసి.. అనవసరంగా ఏపీ నుంచి విడిపోయామని తెలంగావారు బాధపడే రోజు వస్తుందని శిద్దా అన్నారు. మరి ఈ మాటల్లో నిజమెంతో.. కాలమే సమాధానం చెబుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: