ఎట్టకేలకు ఎర్రచందనం స్మగ్లింగ్‌ లావాదేవీల్లో కీలకపాత్ర వహించిన మణి అన్నన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.స్మగ్లర్ మణివణ్ణన్ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలో పట్టుబడ్డ అంతర్జాతీయ  స్మగ్లర్ ముఖేష్ బదానియా ఇచ్చిన సమాచారం మేరకు మణివణ్ణన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలి కూడా పోలీసులు అరెస్టు చేసి కీలక సమాచారాన్ని రాబట్టారు. అంతే కాదు   ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశవ్యాప్తంగా వేట సాగిస్తున్నారు.


ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మస్తాన్ వలీని అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యం


తమిళనాడు, ఏపీలో ఎర్రచందనం సరఫరాలో మణి కీలకపాత్ర పోషించాడని సమాచారం. మంగళవారంనాడు మణిని పోలీసులు కోర్టులో ప్రవేశపెడుతారు. తమిళనాడుకు చెందిన మణి చాలా కాలం నుంచి రాయలసీమ ప్రాంతం, ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఉన్న స్మగ్లర్లకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తోంది. తమిళనాడు, ఢిల్లీ, ఏపీలో ఎర్రచందనం సరఫరాలో మణి కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ముఖేష్‌ విచారణలో మరికొంత మంది స్మగ్లర్ల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: