తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన దిగ్విజయమైందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే భారత ఐటీ పరిశ్రమలో చెప్పుకోదగిన స్థానంలో ఉన్న హైదరాబాద్.. కేటీఆర్ పర్యటన తర్వాత మరింతగా దూసుకుపోతుందని అంచనా వేస్తోంది. తన పర్యటనలో కేటీఆర్ దాదాపు 30పై ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహించారట. 

కేటీఆర్ టూర్ సక్సస్.. 


అమెజాన్ సంస్థ దాదాపు లక్ష చదరపు అడుగుల్లో భారీ గోడౌన్ ను హైదరాబాద్లో  ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో  విస్తరణ చేపడుతుందట. ఇప్పటికే గూగుల్ సంస్థ అమెరికా తర్వాత తన తొలి క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా డిఈషా- బ్లాక్ స్టోన్ సంస్థలు రూ. 1300కోట్లతో ఆర్ అండ్ డీ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాయట. 

హైదరాబాద్ కు క్యూ కడుతున్న సంస్థలు..


మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల భేటీ అయిన కేటీఆర్.. తెలంగాణ అనుసరిస్తున్న ఐటీ అనుకూల విధానాలను వివరించారట. ఎలాంటి సంస్థకైనా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తాయన్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారట. కేటీఆర్ భేటీతో బాగా ఇంప్రెస్ అయిన నాదెళ్ల.. స్వయంగా పలుసంస్థలకు స్వయంగా సిఫార్సు చేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి: