ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే అధ్యక్షురాలు.. అసెంబ్లీ బరిలో దిగనున్నారు. ఆమె కోసమే ఆ పార్టీ ఎమ్మెల్యే వెట్రివేలు ఆర్కేనగర్ స్థానం నుంచి రాజీనామా చేశారు. ఈ స్థానానికి జూన్ 27న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ కూడా ప్రకటించడంతో ఎన్నికల సందడి మొదలవుతోంది. 

నువ్వా.. నేనా..? 


ఈ పరిస్థితుల్లో జయలలితకు పోటీగా ఎవరు నిలుచున్నా ఓటమి ఖాయం. అందుకే ఓటమికి సిద్ధపడి పోటీ చేసే అభ్య్రర్థుల కోసం పార్టీలు వెదుకుతున్నాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ తరపున జయలలితపై పోటీ చేసేందుకు ప్రముఖ తమిళనటి ఖుష్బూ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

గతంలో బీజేపీలో ఉన్న ఖుష్భూ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. జయలలితపై పోటీ చేసి.. గెలుస్తాననే నమ్మకం లేకపోయినా... భవిష్యత్ రాజకీయ జీవితానికి ఇది పనికొస్తుందన్న ఆలోచనలో ఖుష్బూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక డీఎంకే కూడా ధీటైన అభ్యర్థి కోసం వెదుకుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: