రంగారెడ్డిజిల్లా గండి పేటలో టిడిపి 34వ మహానాడు ను ప్రారంభించి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా  ప్రతి సంవత్సరం కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుందన్నారు, టిడిపికి మహానాడు పవిత్రమైన, చాలా ముఖ్యమైన పండుగ అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు అని అన్నారు. ఎన్ టిఆర్ జన్మదిన రోజున పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.

మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ కి పుష్పాభివందనం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, 


విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం కలిగిందని బాబు తెలిపారు,తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాని కోసం మన నాయకులను బజారులో పశువుల్లా కొంటున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణలో సమస్య ఉన్న చోట మన నాయకులున్నారని, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.   ఇక పోతే 2022 నాటికి దేశంలోనే టాప్‌-3 స్థానంలో ఏపీ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు, అంతే కాదు ఏపీలో విపరీతమైన సహజవనరులు ఉన్నాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

తెలంగాణ బోనాలు ఎత్తుకొని వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పారాశ్రామికాభివృద్ధికి సముద్ర తీరాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు.అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని... తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసం టిడీపీ పార్టీ పెట్టారని ఆపార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.దేశంలో అనేక పార్టీలు ఉన్నా టీడీపీకి ప్రత్యేకత ఉంది, ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ భావాలతో టిడిపి పార్టీ ముందుకెళ్తోందన్నారు.ఏడాదిలోగా ప్రతి ఇంటికి ఫైబర్‌ కనెక్టివిటీని కల్పించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ ఎంత ఉపయోగించుకుంటే అంత లాభమని చంద్రబాబు పేర్కొన్నారు. అందరికీ అనువుగా ఉండాలనే అమరావతిలో రాజధాని పెట్టామని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: