తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఒక్క‌సారే హైద‌రాబాద్ అభివృద్ది పై క‌న్నుప‌డింది. ఇప్ప‌టికే కొద్దొగొప్పో అభివృద్ది లో ఉన్న హైద‌రాబాద్ ను ఇంత హ‌డావుడి ఎందుకు చేస్తున్నాడ‌న‌ది అంద‌రి క‌లుగుతున్నసందేహం. ఈ మ‌ద్య కాలంలో స్వ‌చ్చ హైద‌రాబాద్ కార్యక్ర‌మానికి శ్రీకారం చుట్టి గ‌ల్లి గ‌ల్లి తిరిగి ప్ర‌జ‌ల‌కు వరాల జ‌ల్లులు కురుపించారు. ఓకే అభివృద్దిని ఎవ్వ‌రు వ‌ద్ద‌న‌రు. కానీ తెలంగాణ లో మిగ‌తా 9 జిల్లాల‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టి కేవ‌లం హైద‌రాబాద్ పైనే పోక‌స్ పెట్ట‌డం క‌రెక్ట్ కాద‌న‌ది ప్ర‌జ‌ల అభిప్రాయం. ప్ర‌పంచ ప‌ట్టంలో హైద‌రాబాద్ బ్యాండ్ ఇమేజ్ ని పెంచుతానంటున్న కేసీఆర్, అదే ప్ర‌పంచ ప‌ట్టంలో 10 జిల్లాల‌ తెలంగాణ ఇమేజ్ పెంచితే ఇంక బాగుంటుంది కదా..!  

ముఖ్యమంత్రి కేసీఆర్‌ది విలక్షణ శైలి


ముఖ్యమంత్రి కేసీఆర్‌ది విలక్షణ శైలి. ఆయన రూటే సపరేటు! ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశమంతటా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ఆయా రాష్ర్టాలు చాలా రోజుల క్రితమే నిర్వహించాయి. అప్పుడు ఆ కార్యక్రమంతో తమకు సంబంధం లేదన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహరించారు. గవర్నర్‌ నరసింహన్‌ వంటివారు అప్పట్లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నా, తెలంగాణలో కనీసం మంత్రులు కూడా పాల్గొనలేదు. ఇప్పుడు అందరూ మర్చిపోతున్న తరుణంలో రాజధానిలో స్వచ్ఛ హైదరాబాద్‌ పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా పెద్ద హడావుడి చేశారు. గవర్నర్‌ను కూడా భాగస్వామిని చేశారు.అప్పుడు పట్టించుకోని పెద్ద మనిషి ఇప్పుడెందుకు ఆర్భాటం చేస్తున్నారా? అని ఎవరికైనా అనుమానం రావచ్చు. 

 తెలంగాణ రాష్ట్ర సమితి పట్టు సాధించలేకపోయింది


మరో ఏడెనిమిది నెలల్లో నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే సమాధానం దొరుకుతుంది. ఈ ఎన్నికలు ఉన్నాయి కనుకే ముఖ్యమంత్రి ధ్యాస అంతా హైదరాబాద్‌ నగరంపై పడింది. ఏడాది కిందట జరిగిన ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సమితి పట్టు సాధించలేకపోయింది. అందుకే నగర పాలక సంస్థ ఎన్నికల్లోనైనా గ్రేటర్‌పై పట్టు సాధించాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ రాజకీయ పాచికలు విసురుతున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, ఆకాశ హర్మ్మాలు, ఆకాశ మార్గాలు అంటూ ఊదరగొట్టారు. ఈ ప్రకటనల ద్వారా మధ్యతరగతి, ఎగువ తరగతి వారి మనసులు గెల్చుకోవాలన్నది కేసీఆర్‌ లక్ష్యం.


ఈ కార్యక్రమాన్ని ఎవరూ తప్పుపట్టడానికి సాహసించలేరన్న సంగతి కేసీఆర్‌కు తెలుసు


ఈ హర్మ్యాల నిర్మాణం జరుగుతుందనుకున్నా అందుకు సమయం పడుతుంది. ఎన్నికలేమో ఆరేడు మాసాల్లో జరుగుతాయి. అయినా, మధ్య తరగతి ప్రజలు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టి బస్తీవాసులపై పడింది. పేద ప్రజలు కుడుం ఇస్తేనే కాదు- ఇస్తామని చెప్పినా సంబరపడిపోతారు. ఈ మర్మం తెలుసు కనుక ఓట్ల కోసం అని చెప్పకుండా స్వచ్ఛ హైదరాబాద్‌కు తెర తీశారు. ఈ కార్యక్రమం జరిగిన మూడు రోజులూ ముఖ్యమంత్రి బస్తీల్లోనే తిరిగారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎవరూ తప్పుపట్టడానికి సాహసించలేరన్న సంగతి కేసీఆర్‌కు తెలుసు. అందుకే, కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు, కార్యకర్త నుంచి గవర్నర్‌ వరకూ అందరినీ ఇందులో భాగస్వాములను చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే తేనెతుట్టెను కదిపారు


బస్తీవాసుల్లో కాంగ్రెస్‌ పార్టీకి అంతో ఇంతో పట్టుంది. అందుకే వారిని తనవైపు తిప్పుకోవడానికి ఇళ్ల నిర్మాణం ప్రకటన చేశారు. అయితే, నాలుగేళ్లలో రెండు లక్షల ఇళ్లు నిర్మించాలంటే రూ.18 వేల కోట్లు కావాలి. అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు కనుక ఏదో ఒక వివాదం చెలరేగి ఈ కార్యక్రమం అమలుకు నోచుకోకూడదు. ముఖ్యమంత్రి అభిమతం ఇదే కావచ్చు. అందుకే ముందుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే తేనెతుట్టెను కదిపారు. ఇంకేముంది.. ఉస్మానియా జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ విద్యార్ధినాయ‌కులు తీవ్ర అందోళ‌న‌లు చెప‌ట్టారు. ముఖ్యమంత్రికి కావలసింది అదే! అయితే, వెంటనే వెనక్కు తగ్గితే బస్తీవాసులు తన చిత్తశుద్ధిని శంకించే ప్రమాదం ఉంది. కనుక, నేను మొండివాడిని అంటూ ప్రకటనలు చేశారు. 

రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు


ఇళ్లు కడదామంటే సికింద్రాబాద్‌లో జాగా లేదంటున్న ముఖ్యమంత్రి.. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల్లో జాగా ఉందని చెప్పారు కదా? ముందుగా అక్కడ కట్టవచ్చు కదా? హైదరాబాద్‌లో విలువైన స్థలాన్నింటినీ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్ధీకరణ పేరిట కావలసిన వారికి కట్టబెట్టి, తాను కొంత సొమ్ము చేసుకున్నారు. కుల సంఘాలకు ఎకరాల వంతున కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడే నేను జాగా ఎక్కడ? అని ప్రశ్నించాను. బంజారా భవన్‌ నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన స్థలం వివాదంలో పడిన సంగతి తెలిసిందే! సికింద్రాబాద్‌లో స్థలమే లేదంటున్న ముఖ్యమంత్రి, క్రైస్తవుల కోసం స్థలం ఎక్కడ నుంచి కేటాయించారు? నిజానికి, సికింద్రాబాద్‌లో రెవెన్యూ భూములు కొన్ని ఉన్నాయి. పేదల కోసం వాటిని వినియోగించవచ్చు.


మనసులో వేరే ఉద్దేశం ఉన్నప్పుడు ఏలిన వారికి పరిష్కారాలు కాదు కావలసింది- వివాదాలు మాత్రమే! ఆంధ్రా పాలకులు నగరాన్ని నాశనం చేశారని ఇప్పుడు అంటున్న కేసీఆర్‌ ఆనాడు ప్రభుత్వ భూములను రాజశేఖర్‌ రెడ్డి క్రమబద్ధీకరిస్తూ పోతున్నా నోరు కూడా మెదపలేదు. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఆయన అనుచరులు బినామీ పేరిట ఇబ్బడిముబ్బడిగా భూములు సొంతం చేసుకున్నారు. వాటన్నింటిపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెడితే పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమి దొరక్కపోదు.


మరింత సమాచారం తెలుసుకోండి: