తెలుగుదేశం యువనేత లోకేశ్ కు టీఆర్ఎస్ నేతలను కానీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని గానీ విమర్శించడమంటే భలే సరదా.. ఎక్కడ అవకాశం చిక్కినా.. వదలిపెట్టరు. అలాంటిది మహనాడు సమయంలో ఊరుకుంటారా.. మహానాడు హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో జరుగుతున్న సంగతి తెలిసిందే. 

లోకేశ్ తొందరపడ్డారా.. ?


మహానాడు తొలిరోజు లోకేశ్ ప్రసంగిస్తున్న సమయంలో.. కరెంట్ కట్ అయ్యింది. సరిగ్గా అదే సమయంలో లోకేశ్ కూడా ఆంధ్ర- తెలంగాణ సర్కార్ల పనితీరుపై మాట్లాడుతున్నారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్నారో ఏమో.. చంద్రబాబు అలా అభివృద్ది చేస్తుంటే.. ఇదిగో.. ఇక్కడ సీఎం కనీసం కరెంట్ కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్నారని కరెంట్ కట్ పై సెటైర్ వేసేశారు. 

చినబాబుకు కరెంట్ షాక్


ఐతే.. అసలు విషయం ఏంటంటే మహానాడులో మైకు సహా స్టేజీపై ఉన్న ఇతర పరికరాలకు డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకున్నారట. ట్రాన్స్ కో.. కనెక్షన్‌ను వాడుకోలేదట. జనరేటర్ ఎంసీబీ ట్రిప్ కావడం వల్లే లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు అంతరాయం ఏర్పడిందట. ఈ విషయాలను వివరిస్తూ.. ట్రాన్స్ కో లేటెస్టుగా మీడియా ప్రకటన విడుదల చేసింది. 

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పేరుతో తీసుకున్న హెచ్‌టీ సర్వీసు కనెక్షన్‌ను కేవలం సభా ప్రాంగణానికి విద్యుత్ సరఫరా కోసమే వినియోగించుకున్నార ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. ప్రాంగణానికి విద్యుత్ సరఫరా చేస్తున్న 11 కేవీ ఫీడర్ బుధవారం ట్రిప్ కాలేదని తెలియచేసింది. అంటే.. అసలు విషయం తెలియకుండానే లోకేశ్ తొందరపడ్డారన్నమాట. మరి మహానాడు వంటి సభలో కరెంటు నిర్వహణ సరిగ్గా చూసుకోకుండా ఛాన్స్ దొరికింది కదా అని కేసీఆర్ పై విమర్సలు చేయడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: