తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తనకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కంటే అదనంగా పోటీ చేసి.. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎలాగోలా ఎమ్మెల్యేలను దువ్వవచ్చన్న ఆ పార్టీ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో మరి. 

టీఆర్ఎస్-వైసీపీ దోస్తీ..?


ఆ వ్యూహాల్లో భాగంగానే.. తెలంగాణలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోసం కేటీఆర్ జగన్ కు ఫోన్ చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని కేటీఆర్ జగన్ ను అడిగినట్టు సమాచారం. వైసీపీ ఎలాగూ బరిలో దిగలేదు కాబట్టి.. మీ ఎమ్మెల్యేల మద్దతు మాకు ఇస్తే బావుంటుందని కేటీఆర్ ప్రతిపాదించారట.  

కేటీఆర్ విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించినట్టు కథనాలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే.. టీఆర్ఎస్- వైసీపీ కుమ్మక్కయ్యాయి అంటూ ఏపీలో టీడీపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మజ్లిస్ వంటి పార్టీల మద్దతు పొందిన టీఆర్ఎస్ విజయంపై ధీమాతో ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: