ఏపీలో మీడియా పార్టీల వారీగా చీలిపోయిందన్న సంగతి తెలిసిందే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు.. వాటికి చెందిన చానళ్లు టీడీపీకి సపోర్ట్ గా ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మీడియా మేనేజ్ మెంట్ లో ముందుండే చంద్రబాబు టీవీ9లో కూడా పాజిటివ్ వార్తలు వచ్చేలా ప్రభావితం చేస్తున్నారని ఓ టాక్ ఉంది. జగన్ కు సొంత పేపప్ టీవీ ఉండనే ఉన్నాయి.  

ఆ రెండు ఛానళ్లపై బాబు ఆగ్రహం.. 


ఐతే.. సాక్షిపై ఎలాగూ వైసీపీ ఛానల్ అన్న ముద్ర ఉంది. సో టీడీపీకి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సాక్షి టీవీ తరహాలోనే చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని ఛానళ్లలో కథనాలు వస్తున్నాయి. ఇది చంద్రబాబును చిరాకు పెడుతోంది. ఇంతవరకూ వాటిపై బహిరంగంగా కామెంట్ చేయని చంద్రబాబు మహనాడులో వాటిపై విరుచుకుపడ్డారు. 

బాబును చిరాకు పెడుతున్న ఛానళ్లు..


కొన్ని ఛానళ్లు, పత్రికలు సాక్షిలాగా తయారయ్యాయిని.. సొంత పత్రిక, టీవీలో వార్తలను జనం నమ్మడం లేదు కాబట్టి జగన్.. మిగిలిన ఛానళ్లను కూడా వాడుకుంటున్నారని.. వారికి లంచాలిచ్చి వ్యతిరేక కథనాలు వేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఛానళ్ల విశ్వసనీయతను ఇకపై టీడీపీ ప్రశ్నిస్తుందని సవాల్ చేశారు. బాబు వ్యాఖ్యలు మీడియాలో కలకలం సృష్టించాయి. బాబును చిరాకు పెట్టిన ఆ ఛానళ్లు ఎన్టీవీ, టీవీ5 కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: