తెలంగాణ సాధన లో ఓయూ ఎంత కీలకమైన పాత్ర పోషించిందో అందిరికీ తెలుసు.. పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఇవేమీ లెక్క చేయకుండా పట్టిన పట్టు వీడకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాటం జరిపారు.  2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ జరిగింది. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున్న జరుపుతుంది, కానీ ఓయూ విద్యార్థులు మటుకు సంతోషంగా లేరు పైగా ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యతరేకించారు కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదవారికి కోసం ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పడమే.

ఓయూ విద్యార్థుల నిరసన


నాటి నుంచి కేసీఆర్ కి వ్యతరేకంగా మరో పోరాటం చేపట్టారు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దగ్ధాలు లాంటివి చేసినా కేసీఆర్ అన్నమాట వెనక్కి తీసుకోలేదు. దీంతో  ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: