సెక్షన్ 8, సెక్షన్ 8, సెక్షన్ 8.. ఇప్పుడు తెలుగు మీడియాలో బాగా వినిపిస్తున్న మాట ఇది. ఓటుకు కోట్లు వివాదాన్ని పక్కదారి పట్టించే విషయంలో ఒక విధంగా టీడీపీ గ్రాండ్ సక్సస్ అయినట్టే భావించాలి. హైదరాబాద్ లో ఆంధ్రులకు రక్షణ లేందటూ సెంటిమెంట్ రాజేసిన టీడీపీ ఇప్పుడు ఆ వాదనలో పైచేయి సాధించింది. 

ఓవైపు ఓటు కు కోట్లు కేసును ఎదుర్కోవడమే కాకుండా.. ప్రత్యర్థి వైసీపీని కూడా ఇరుకున పెట్టేసింది. మీకు హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణ పట్టదా అంటూ ఎదురు దాడికి దిగుతోంది. మరి ఇంతకూ హైదరాబాద్ లో ఉన్న అసలైన సెటిలర్లు ఏమనుకుంటున్నారు. తమకు, తమ ఆస్తులకు రక్షణ ఉందని భావిస్తున్నారా.. ఈ విషయం చెప్పాల్సింది సెటిలర్లే. 

సెక్షన్ 8 అమలు ప్రస్తుతానికి అవసరం లేదు..


ఓవైపు టీఆర్ఎస్ టీడీపీ నేతల వాగ్వాదం నడుస్తుంటే.. ఇప్పుడు సెటిలర్లు కూడా గళం విప్పారు. అయితే అనూహ్యంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు పలికారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలో ఒక్క సెటిలర్ కు కూడా ఏమీ కాలేదని.. ఇప్పుడు అనవసరంగా సెక్షన్ 8 అమలుపై గొడవ చేయడం బాధ్యతారాహిత్యమని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన..మీడియా ముందు తెలిపారు. 

ప్రస్తుత టీఆర్ఎస్ పాలన బావుందంటున్న ప్రసూన చివర్లో ఓ కొసమెరుపు వదిలారు. సెక్షన్ 8 అమలు ప్రస్తుతానికి అవసరం లేదంటూనే.. దాన్ని పూర్తిగా ఎత్తివేయవద్దన్నారు. భవిష్యత్తులో సీమాంధ్రుల రక్షణకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకునేలా ఆ సెక్షన్ ను అలాగే ఉంచాలని ఆమె కోరారు. పిలవని పేరంటానికి ఎందుకొస్తారంటూ ఆమె టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ విషయంలో అనవసర రాద్దాంతం చేసిన తమ భద్రతకు ముప్పుతేవద్దని ఆమె సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: