గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటుకు నోటు వ్యవహారంపై పవన్ కళ్యాన్ స్పందించారు.. అంటే మీడియా పరంగా కాదు ట్విట్టర్ పరంగా.. అవును పాలకుల వైఖరిపై ప్రశ్నిస్తానని ‘జనసేన’ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాన్ పార్టీ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రశ్నలు ఎక్కడా ప్రస్తావించలేదు.. కాకపోతే ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి గురించి రైతులు పోరాటం చేస్తుంటే అక్కడకు వెళ్లి వారి తరుపున మాట్లాడారు. బలవంతంగా లాక్కుంటే రైతుల తరుపు నుంచి ప్రభుత్వంపై పోరాడుతానని వారికి హామీ ఇచ్చారు. తర్వాత ఇప్పటి వరకు దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 


పవన్ ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 సినిమా బిజీషెడ్యూల్ లో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాన్ పై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో స్పందించిన పవన్ కళ్యాన్ ఓటుకి నోటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8లపై తన అమూల్యమయిన అభిప్రాయాలు త్వరలో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ అకౌంటులో ఓ సందేశం పెట్టారు. ‘తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని’ అంటారు. ‘అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలుతో ప్రభుత్వాలని నడిపితే 'భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి.” ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వాడీ వేడిగా కొనసాగుతున్న విషయంపై ఆయన అభిప్రాయాలు ఎప్పుడు వెల్లడిస్తారో అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. 

పవన్ కళ్యాన్ ట్విట్స్

మరింత సమాచారం తెలుసుకోండి: