ఏపీ రాజకీయాలు చంద్రబాబు, జగన్ చుట్టూ తిరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఇద్దరిలో ఎవరూ వదులుకోరు. అలాంటింది చంద్రబాబు నోటుకు కోట్లు ఇష్యూలో దొరికిపోతే జగన్ వదులుతారా.. నెవర్. అందుకే బాబుపై చేయాల్సిన విమర్శలన్నీ చేస్తున్నారు. బాబును ఇరుకున పెట్టేందుకు ఢిల్లీ యాత్రలు కూడా చేశారు. 

ఐతే.. వైసీపీ ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఈ ఇష్యూ చప్పగా ముగుస్తుండటం ఆ పార్టీ నేతలకు నిరాశ కలిగిస్తోంది. ఇక చంద్రబాబుకు నోటీసులో.. అరెస్టో జరిగిపోతుందని జగన్ ఆశలు పెట్టుకుంటే.. ఆ దిశగా పరిణామాలు ఏమాత్రం కదలడం లేదు. టీడీపీ చాణక్యంతో ఈ వ్యవహారం కాస్త వైసీపీకి బెడిసికొట్టే పరిస్థితి కూడా వచ్చింది. జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారన్న ప్రచారం టీడీపీ బాగా చేసింది.

ఓటుకు కోట్లు.. జగన్ ను నిరాశపరిచిందా.. ?

revanth reddy acb కోసం చిత్ర ఫలితం
ఈ నేపథ్యంలో జెరూసలేం యాత్ర ముగించికుని వచ్చిన జగన్.. ముందుగా ఓటుకు నోటు కేసు గురించే ఆరా తీశారట. ఈ ఇష్యూ ఎక్కడివరకూ వచ్చింది.. లేటెస్ట్ డెవలప్ మెంట్స్ ఏంటి.. ఈ కేసు గురించి ఇంకా మనం ఏం చేయగలం అంటూ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ ఇష్యూలో వీలైనంత ఎక్కువగా చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్నది వైసీపీ వ్యూహం. 

ఓటుకు నోట్లు కేసు షాక్ నుంచి కాస్తో కూస్తే తేరుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు మానసికంగా కూడా వైసీపీ నేతలపై డామినేషన్ ప్రదర్శిస్తున్నారు. జగన్ జెరుసలేం యాత్ర నుంచి వస్తూనే ఓటుకు నోటు కేసు గురించి వాకబు చేయడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో ఇంకే సమస్యలూ లేనట్టు ఈ కేసు గురించే మొదటి ప్రస్తావించారని.. దీన్నిబట్టి రాష్ట్ర సమస్యలపై జగన్ కు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి వారు విమర్సలు గుప్పించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: