రాజకీయ నాయకులపై కేసులు సర్వసాధారణమైపోయాయి. కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకూ ఏదో ఒక అక్రమాల కేసు లేకుండా ఉండటం లేదు. అవినీతి వార్తో, అక్రమాల వార్తో బయటపడినప్పుడు మీడియా కూడా కొన్ని రోజులు హాడావిడి చేస్తుంది. ఆ తర్వాత ఆ కేసు కోర్టుల్లో సంవత్సరాల తరబడి నానుతుంది.. ఏవో కొన్ని కేసుల్లో తప్ప నేరాలు రుజువుకావడం.. నాయకులు ఊచలు లెక్కబెట్టడం జరగదు. 

ఐతే.. ఆ అక్రమం వెలుగు చూసిన కొన్నిరోజులు సదరు రాజకీయ పార్టీ సతమతమవుతుంది. ప్రత్యర్థి పక్షాల నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. ఎదుటి పక్షానికి చెందిన పాత అవినీతి బాగోతాలు మళ్లీ విప్పి.. మీరేమైనా తక్కువ తిన్నారా అని నిలదీస్తుంది. కానీ ఇప్పుడు లేటెస్టుగా వెలుగుచూసిన ఓ ఎంపీ బాగోతం మాత్రం ఆ ఎంపీ పార్టీనే కాకుండా ఎదుటి పార్టీని కూడా ఇరుకున పెట్టేస్తోంది. 

కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు.. విమర్శించేవారెవరు..?


అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఓ 50 కోట్లకు మోసం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. వాస్తవానికి   కొత్తపల్లి గీత వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి ఈ అవినీతి ఆరోపణలు వైసీపీని ఇరుకున పెట్టాలి. అసలే ఆ పార్టీ నాయకుడిపై సీబీఐ కేసులు నడుస్తున్నాయి. నాయకుడే అలా ఉంటే.. ఎంపీలు ఇంకెలా ఉంటారు అంటూ ఈ పాటీకి టీడీపీ విమర్శలపై విమర్శలు గుప్పించేదే. 

కానీ కొత్తపల్లి గీత విషయంలో అలా జరగదు. ఎందుకంటే.. కొత్తపల్లి గీత ఎంపీగా ఎన్నికైన తొలి రోజుల్లోనే వైసీపీకి దూరంగా.. టీడీపీకి దగ్గరగా మసిలారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె టీడీపీ సభ్యురాలిగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమెను టీడీపీ పెద్దగా విమర్శించదు. అలాగని వైసీపీ కూడా తమ పార్టీ నుంచే గెలిచింది కాబట్టి.. పెద్దగా విమర్శించదు. అలా కొత్తపల్లి గీత లక్కీగా విమర్శల నుంచి తప్పించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: