ఓటుకు నోటు వ్యవహారం ఖమ్మం జిల్లా శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కు గతంలో ఏసీబీ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.  కాగా  ఎసిబి ఇచ్చిన నోటీసుకు సమాధానంగా తన ఆరోగ్యం బాగా లేనందున విచారణకు రాలేనని తెలియజేస్తూ లేఖ రాశారు. అంతే కాదు విచారణకు పది రోజుల గడువు కూడా సండ్ర అడిగాడు అయితే ఆ పదిరోజుల గడువు ఎప్పుడో ముగిసింది... అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. సండ్ర  ఎక్కడున్నాడనే విషయంపై గొత కొద్ది రోజులుగా విభిన్నమైన కథనలాలు వచ్చాయి.

సండ్ర ఆంధ్రప్రదేశ్ లో తల దాచుకున్నాడని చంద్రబాబే ఆయన కు ఆశ్రయం కలిప్పంచారని రక రకాలుగా కథనాలు వచ్చాయి. తాజాగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చి ఈ రోజు విడుదల అవుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ను సండ్ర కలిసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి సండ్ర మరో లేఖ రాశారు దీని ప్రకారం తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాయని, విచారణకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: