బెయిల్ పై విడుదలైన సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులనూ, టీఆర్ ఎస్ నాయకులనూ రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు తిట్లు తిట్టేశారు. మంత్రులను ఆలుగడ్డలు అమ్ముకునేటోడు.. మందులో సోడా పోసేటోడు.. సన్నాసులు వంటి ఘాటైన పదజాలంతో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సహజంగానే టీఆర్ఎస్ నాయకులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. బెయిల్ పై విడుదల అవ్వడం అదో ఘన కార్యం అన్నట్టు చిత్రించుకోవడం దివాలాకోరు తనమని కామెంట్స్ చేశారు. 

ఇలాగే మాట్లాడితే నాలుగు కోస్తాం: బాల్క సుమన్

Image result for balka suman
టీఆర్ఎస్ యువ నాయకుడు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మరో అడుగు ముందుకేశారు. రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై ఇలాగే మాట్లాడితే ఆయన నాలుక కోసే రోజు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రా సీఎం చంద్రబాబుఇచ్చే హెరిటేజ్ బిస్కట్లకు రేవంత్ ఆశపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏమైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడా?దొంగలా పట్టుబడి దొరికిపోయాడని, అయినా దబాయించాలని చూస్తున్నాడని సుమన్ అన్నారు.

మొదట రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ఆ తర్వాత దానికి స్పందనగా టీఆర్ఎస్ నేతల కామెంట్లు రాజకీయ విమర్శల స్థాయిని దిగజార్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐతే.. కేసీఆర్ వాడే భాష ముందు రేవంత్ భాష అనాగరికంగా లేదని టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. దిగజారుడు వ్యాఖ్యల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వంటి నేతలకు అలాంటి భాషే కరక్టని ఎదురుదాడి చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: